Breaking News

'దేవ‌ర'కు ఏడాది.. అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చిన మేకర్స్‌

Published on Sat, 09/27/2025 - 12:23

ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్‌ సినిమా దేవ‌ర ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తాజాగా సీక్వెల్‌ను ప్రకటించారు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. దేవర విడుదలైన మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు (గ్రాస్‌) సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఫైనల్‌గా రూ. 500 కోట్ల మార్క్‌ను ఈ చిత్రం చేరుకుంది. ఏకంగా ఆరు కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. తారక్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ చిత్రంగా నిలిచిన ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించారు. ఈ మూవీతోనే జాన్వీకపూర్‌ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో  సైఫ్‌ అలీఖాన్‌, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌ వంటి స్టార్స్‌ కీలకపాత్రల్లో నటించారు.

బాలీవుడ్‌ చిత్రం వార్‌2తో కాస్త నిరాశపరిచిన ఎన్టీఆర్‌ త్వరలో ఒక బలమైన చిత్రంతో రానున్నారు. ఎన్టీఆర్‌ (NTR),  ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.  మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది జూన్‌ 25న ఈ చిత్రం విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు.  దీనికి ‘డ్రాగన్‌’ అనే పేరు పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతుంది. 

త్రివిక్రమ్‌- ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో కూడా ఒక సినిమా ఉన్న విషయం తెలిసిందే. జైలర్ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో కూడా ఎన్టీఆర్‌ ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఇలా భారీ లైనప్‌తో ఉన్న తారక్‌ నుంచి మొదట వెండితెరపైకి వచ్చేది మాత్రం ప్రశాంత్‌ నీల్‌ చిత్రమే కావడం విశేషం. ఆ తర్వాతే మిగిలిన దర్శకుల ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కనున్నాయి.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)