Breaking News

రండి.. నాతో చేతులు కలపండి.. యూత్‌కి ఎన్టీఆర్‌ పిలుపు

Published on Wed, 09/25/2024 - 11:51

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌(ట్విటర్‌)లో ఓ స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు.

‘మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమే, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో, సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్‌ కోసమో మాదక ద్రవ్యాలపై ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నింటికంటే విలువైనది. రండి.. నాతో చేతులు కలపండి.  డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా.. వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్‌ నంబర్‌ 8712671111 సమాచారం అందించండి ’అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశాడు. 

(చదవండి: ‘ఆచార్య’ ఫలితం తర్వాత చిరంజీవీ మెసేజ్‌ చేశాడు...‘దేవర’ మార్పులు చేశా: కొరటాల)

కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ ‍రెడ్డి కోరిన సంగతి తెలిసిందే.  కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్‌లో రేవంత్‌ మట్లాడుతూ.. ఇకపై ఎవరికైనా సరే టకెట్‌ రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌ కూడా దేవర సినిమా రిలీజ్‌కి రెండు రోజుల ముందుకు అలా వీడియో చేసి పంపారు. 

ఇక దేవర విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ డ్యూయెల్ రోల్‌ ప్లే చేశాడు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. 


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)