AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!
Breaking News
అఫీషియల్.. 'దేవర' తొలిరోజు కలెక్షన్ ఎంతంటే?
Published on Sat, 09/28/2024 - 12:12
ఎన్టీఆర్ 'దేవర' మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది గానీ దాదాపు థియేటర్లన్నీ హౌస్ఫుల్స్ అయిపోయాయి. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రతిచోట దేవరోడి బీభత్సం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తొలిరోజు భారీ కలెక్షన్స్ వచ్చాయి. సోలోగా వచ్చిన తారక్.. రూ.150 కోట్ల మార్క్ తొలిరోజే దాటేశాడు.
(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)
ఓవర్సీస్లో రిలీజ్కి ముందే దాదాపు రెండున్నర మిలియన్ల వసూళ్లని అందుకున్న దేవర.. తొలిరోజు ముగిసేసరికి 3.8 మిలియన్ డాలర్లు సాధించింది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.60 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక నైజాంలో 'దేవర'కు తొలిరోజు రూ.20 కోట్ల మేర కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఏకంగా రూ.172 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు నిర్మాతలు ఘనంగా ప్రకటించకున్నారు. ఈ లెక్కన చూసుకుంటే వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.400 కోట్ల మార్క్ దాటేస్తుందేమో?
(ఇదీ చదవండి: 'దేవర'తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందా?)
No force can hold back the TSUNAMI OF #DEVARA 🔥#BlockbusterDEVARA pic.twitter.com/oGhYIZ0TuG
— Devara (@DevaraMovie) September 28, 2024
Tags : 1