Breaking News

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు 'దేవర' నిర్మాత గుడ్‌న్యూస్‌

Published on Tue, 01/27/2026 - 10:46

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త.. దేవర-2 ఉంటుందని నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఆపై సినిమా విడుదల గురించి కూడా  తెలిపారు. సీక్వెల్‌ గురించి చాలా కాలంగా తారక్‌ అభిమానుల్లో ఉన్న సందేహం ఎట్టకేలకు తీరింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన దేవర (2024)లో విడుదలైంది. భాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీకి సీక్వెల్‌ ఉంటుందని  క్లైమాక్స్‌లోనే దర్శకుడు ప్రకటించినా అధికారికంగా స్పష్టత రాలేదు. అయితే, తాజాగా  ‘దేవ‌ర’ నిర్మాత‌ల్లో ఒక‌రైన సుధాక‌ర్ మిక్కిలినేని ఒక క్లారిటీ ఇచ్చేశారు.

నందిగామ‌లో జ‌రిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత సుధాకర్‌కు దేవర-2 ఉంటుందా, లేదా? అనే ప్ర‌శ్న  ఎదురైంది. దీంతో ఆయన సమాధానం ఇచ్చారు.  ‘దేవ‌ర- 2′ త‌ప్ప‌కుండా ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఈ ఏడాది మే నెల నుంచే షూటింగ్ ప్రారంభం కానుందన్నారు. 2027లో సినిమా విడుద‌ల చేస్తామని అభిమానుల సాక్షిగా ప్ర‌క‌టించారు. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ పోస్ట్‌లు పెడుతున్నారు.  ప్ర‌స్తుతం ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌లో తారక్‌ బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ తర్వాత అంటే మే నుంచి దేవ‌ర‌-2కు  డేట్లు కేటాయించే ఛాన్స్‌ ఉంది.

దేవర-1 విడుదల తర్వాత కొరటాల శివతో ఎన్టీఆర్‌ మళ్లీ కలవలేదు. దీంతో సీక్వెల్‌ లేదని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కొరటాల కూడా వేరే హీరోలతో సినిమాలు చేసేందుకు కొన్ని కథలు రెడీ చేసుకున్నారు. ఇంతలో మళ్లీ తారక్‌ నుంచి పిలుపు రావడం జరిగింది. వారిద్దరి మధ్య కథ ఫైనల్‌ కావడంతోనే ఇప్పుడు అధికారికంగా ప్రకటన వచ్చేసిందని సమాచారం.
 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు