మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
దుల్కర్ సల్మాన్ డైరెక్టర్‌తో రజనీ కాంత్ సినిమా?.. ఇదిగో క్లారిటీ!
Published on Wed, 08/10/2022 - 07:57
Desingh Periyasamy Gave Clarity On Working With Rajini Kanth: 'కనులు కనులను దోచాయంటే' (తమిళంలో కన్ను కన్ను కొళ్‌లైయడిత్తాల్) చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు దేసింగ్ పెరియసామి. దుల్కర్ సల్మాన్, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రం 2020లో విడుదలై అనూహ్య విజయాన్ని అందుకుంది. దీంతో ఈ దర్శకుడు పేరు మారుమ్రోగింది. పలువురు సినీ ప్రముఖులు ప్రసంశించారు. అందులో నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు. కాగా రజనీకాంత్‌తో దేసింగ్ పెరియస్వామి చిత్రం ఉంటుందని ప్రచారం జరిగింది. ఈయన చెప్పిన కథ రజనీకాంత్‌కు నచ్చేసిందని అందులో నటించడానికి ఆయన పచ్చ జెండా ఊపినట్లు ప్రచారం జరిగింది.
అంతేకాకుండా 'అన్నాత్తే' చిత్రం తరువాత దేసింగ్ పెరియస్వామి దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తారని టాక్ కూడా స్ప్రెడ్ అయ్యింది. అయితే అనూహ్యంగా దర్శకుడు నెల్సన్ తెరపైకి వచ్చారు. విజయ్ హీరోగా బీస్ట్ చిత్రాన్ని తెరకెక్కించిన ఈయన తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా 'జైలర్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు దేసింగ్ పెరియస్వామి ఒక భేటీలో పేర్కొంటూ.. తన రెండో చిత్రం రజనీకాంత్ హీరోగా తెరకెక్కాల్సి ఉందని, కానీ కొన్ని కారణాలతో అది జరగలేదన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా రజనీకాంత్‌ను డైరెక్ట్ చేస్తాననే నమ్మకం ఉందన్నారు. కొత్త చిత్రం వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు.
చదవండి: సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్
ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరని గూగుల్ చేసేవాడిని: నితిన్
సుష్మితా సేన్ లైవ్ వీడియోలో మాజీ బాయ్‌ఫ్రెండ్.. లలిత్ ఎక్కడ?
Tags : 1