Gadwal District: బస్సు టైర్లపై అధిక ఒత్తిడి పడటంతో లీకైన గాలి
Breaking News
ఢిల్లీలో పేలుడు.. SSMB29 ఈవెంట్‌పై పడుతుందా..?
Published on Thu, 11/13/2025 - 11:34
మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) సినిమాకు సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15న SSMB29 ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే, ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ఘటన ఈ కార్యక్రమంపై ప్రభావం చూపనుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఢిల్లీలో పేలుళ్ల ఘటన తర్వాత దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని రద్దీ ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సిటీ మెట్రో, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ వంటి ప్రదేశాల్లో సెక్యూరిటీ పెంచారు. అయితే, SSMB29 ఈవెంట్ నిర్వాహుకులపై ఏమైనా ఆంక్షలు పెడుతారనే ఊహాగానాలు వస్తున్నాయి.
ఈ నెల 15న ఈ మూవీ టైటిల్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా జరపాలని రాజమౌళి ప్లాన్ చేశారు. ఆమేరకు కొన్ని వారాల ముందే పనులు ప్రారంభించారు.. ఈ కార్యక్రమం కోసం కనీసం లక్షకుపైగానే అభిమానులు రావచ్చని తెలుస్తుంది. అయినప్పటికీ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరగడంతో అందోళన కలిగిస్తుంది. ఉగ్రవాదులు మరిన్ని పేలుళ్లకు పాల్పడవచ్చనే అనుమానం రావడంతో దేశవ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. ఆపై దేశవ్యాప్తంగా పలు ఆంక్షలు విధించారు.
ఇలాంటి సమయంలో ఇంత పెద్ద ఈవెంట్‌పై కూడా నీలి నీడలు కమ్ముకునేలా ఉంది. భారీగా తరలివచ్చే జనాన్ని కంట్రోల్ చేసి ఈవెంట్ నిర్వహించడం సాధ్యమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందా అనే సందేహం కూడా వస్తుంది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా వంటి స్టార్స్‌తో పాటు చాలామంది వీఐపీలు పాల్గొంటారు. కాబట్టి జాగ్రత్తలతో పాటు ఫుల్ సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆపై పోలీసులను కూడా ఈ కార్యక్రమం కోసం భారీగా మోహరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈవెంట్ జరిగినా పోలీసుల నుంచి ఎక్కువగా ఆంక్షలు రావచ్చని సమాచారం.
Tags : 1