Breaking News

క్వీన్‌ ఆఫ్‌ ‘మార్క్‌’గా దీప్శిఖ చంద్రన్.. ఫ్యాన్స్‌ ఫిదా

Published on Sat, 01/03/2026 - 14:36

కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మార్క్’.డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దీప్శిఖ చంద్రన్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

కన్నడ సినీ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దీప్శిఖ చంద్రన్.. ఈ చిత్రంలో బలమైన పాత్రలో కనిపించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంటోంది. ఆమె యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆమె ధీరవనిత పాత్రకు మహిళా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు దీప్శిఖను "మార్క్ క్వీన్", "క్వీన్ ఆఫ్ మార్క్" అని పిలుచుకుంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు పరిమితంగా ఉంటాయి కానీ, ‘మార్క్’లో దీప్శిఖ పాత్ర బలంగా నిలిచి సినిమాకు మరింత బలం చేకూర్చింది. 

పాజిటివ్ మౌత్ టాక్, థియేటర్ స్పందనతో ‘మార్క్’ కన్నడ మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఈ విజయం దీప్శిఖ చంద్రన్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కన్నడ ప్రేక్షకులకు కొత్త క్రష్‌గా మారిన దీప్శిఖకు గుర్తింపు, ఆదరణ పెరుగుతున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)