Breaking News

ఇండియన్‌ 2: కాజల్‌ స్థానంలో ఆ బాలీవుడ్‌ బ్యూటీ?

Published on Wed, 08/03/2022 - 10:07

లోక నాయకుడు కమల్‌హాసన్‌ కథానాయకుడిగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక‍్కిస్తున్న చిత్రం 'ఇండియన్‌ 2' (భారతీయుడు 2). కమలహాసన్‌తో చేసిన ఫొటోషూట్‌ చిత్రంపై అంచనాలను పెంచింది.  అదే జోరులో సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. దీంతో సినిమా షూటింగ్‌ నిలిచిపోయింది. కొంత భాగం షూటింగ్‌ జరిగిన తరువాత అనూహ్యంగా సెట్లో ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కొల్పోవడం.

చదవండి: డ్రెస్సింగ్‌పై ట్రోల్‌.. తనదైన స్టైల్లో నెటిజన్‌ నోరుమూయించిన బిందు

చిత్రంలో హాస్య భూమిక పోషిస్తున్న వివేక్‌ హఠాన్మరణం, ఆ తరువాత దర్శకుడికి, లైకా ప్రొడక్షన్స్‌ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం ఇలా ఎన్నో రకాలు అడ్డుంకులు వచ్చాయి. ఈ విషయంలో లైకా సంస్థ కోర్టుకు కూడా వెళ్లింది. అయితే దర్శకుడికి, నిర్మాతల మధ్య  సామరస్య పూర్వక చర్చలు జరిగిన అవి ఫలించకపోవడంతో శంకర్‌ ఆర్‌సీ15 మూవీ షూటింగ్‌ను స్టార్ట్‌ చేశాడు. ఎట్టకేలకు ఇటీవల సమస్యలు, విభేదాలు సద్దుమనగడంతో ఇండియన్‌ 2 షూటింగ్‌ ప్రారంభించే ఆలోచనలో ఉంది చిత్ర బృందం.

చదవండి: ఉమా మహేశ్వరి అంత్యక్రియలు, పాడే మోసిన బాలయ్య

అయితే దీనికి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్న కాజల్‌ ఇప్పుడు అందుబాటులో లేదు. ఇటీవల ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర బృందం మళ్లీ హీరోయిన్‌ వేటలో పడిందట. ఇండియన్‌ 2 హీరోయిన్‌గా కాజల్‌ స్థానంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ అయిన దీపికా పదుకొనె, కత్రీనా కైఫ్‌ పేర్లను పరిశీలిస్తున్నారట. అంతేకాదు ఇటీవల వారితో మూవీ టీం సంప్రదింపులు కూడా జరిగిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి వారు సమాధానం ఇవ్వాల్సి ఉందని వినికిడి. ఇక ఇండియన్‌ 2 హీరోయిన్‌పై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగకతప్పదు.

Videos

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

మరోసారి వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత

త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)