Breaking News

మన ఆస్కార్‌ అవార్డ్స్‌ను లాక్కున్నారు.. దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 03/24/2025 - 09:58

బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె(Deepika Padukone) అస్కార్‌ అవార్డ్స్‌-2025 గురించి మాట్లాడారా. ఈ ఏడాదిలో భారత్‌కు అవార్డ్స్‌ రాకపోవడంతో ఆమె విచారం వ్యక్తం చేశారు. పారిస్‌లో జరుగుతున్న లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ లూయిస్ విట్టన్ (Louis Vuitton) షోలో ఆమె పాల్గొంటుండగా ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఆస్కార్ అవార్డులు గెలుపొందే అన్ని అర్హతలు  ఉన్న  అనేక భారతీయ చిత్రాలు ఉన్నాయని దీపికా పదుకొణె చెప్పారు. భారతీయ అభిమానుల హృదయాలను గెలుచుకున్న 'ఆల్‌ వుయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌, మిస్సింగ్‌ లేడీస్‌' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికల మీద ప్రశంసలు అందుకున్నాయి. అయినప్పటికీ ఈ రెండు చిత్రాలు ఆస్కార్‌- 2025 తుది జాబితాలో చోటు దక్కలేదు. ఇలా చాలాసార్లు మనకు రావాల్సిన ఆస్కార్లను లాగేసుకుంటూనే ఉన్నారు. భారతదేశ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి. కానీ, ఆ సినిమాలకు, ఆ కథలకు, నటీనటుల ప్రతిభకు గుర్తింపు ఇవ్వడం లేదు. కారణం ఏంటో తెలియదు.  కానీ, ఆస్కార్‌ మాత్రం మన సినిమాలను తిరస్కరిస్తుంది.  అయితే, ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులలో ది బ్రూటలిస్ట్ చిత్రానికి గాను నటుడు అడ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు రావడం నాకు సంతోషాన్ని ఇచ్చింది.

RRR అవార్డ్‌.. ఎంతో  భావోద్వేగం చెందాను:దీపికా
భారత్‌ నుంచి ఎన్నో విలువైన చిత్రాలు వచ్చినప్పటికీ అస్కార్‌ అవార్డ్‌ దక్కకపోవడం చాలా బాధాకరం అని చెప్పిన దీపికా పదుకొణె.. ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి కూడా మాట్లాడారు. '2023 ఆస్కార్‌ అవార్డ్స్‌ నేను వ్యాఖ్యతగా ఉన్నాను. కానీ, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి ఆస్కార్‌ ప్రకటించిన సమయంలో  నేను ప్రేక్షకుల్లో కూర్చొని ఉన్నాను. అప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను. అవి నాకు ఎంతగానో ప్రత్యేకమైన క్షణాలు. ఆ సినిమాలో నేను భాగం కాకపోయినప్పటికీ ఒక భారతీయురాలిగా ఆ విజయం నా సొంతం అనిపించింది. ఆ గొప్ప క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను.'అని చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో రామ్‌చరణ్‌,ఎన్టీఆర్‌ నటించారు. ఇందులో  నాటు నాటు సాంగ్‌ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌గా ఆస్కార్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)