Breaking News

కస్టడీ పొడిగింపు.. ఆగస్టు 1 దాకా జైల్లోనే దర్శన్‌, పవిత్ర..

Published on Fri, 07/19/2024 - 10:08

దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ హీరో దర్శన్‌ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు. తనకు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి అనుమతి ఇప్పించాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. అయితే ఇందుకు ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ కౌంటర్‌ దాఖలు చేశారు. గురువారంనాడు హైకోర్టులో వీటిపై విచారణ సాగింది. 

ఇంటి నుంచి భోజనం, పరుపు, దిండు, చదవడానికి కొన్ని పుస్తకాలు కావాలని దర్శన్‌ కోరాడు. జైలు నిబంధనల ప్రకారం జైలులో పౌష్టికాహారం ఇస్తున్నామని, అవసరం మేరకు ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు జైళ్ల శాఖ ఐజీని కోరితే ఆయన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అయితే దర్శన్‌ ఎవరినీ సంప్రదించకుండా నేరుగా కోర్టును ఆశ్రయించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కేసులో కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

దర్శన్‌ అండ్‌ గ్యాంగ్‌కు కస్టడీ పొడిగింపు  
ఇదిలా ఉంటే దర్శన్, నటి పవిత్రగౌడ, ఇతర నిందితులకు న్యాయస్థానంలో మళ్లీ చుక్కెదురైంది. వీరి బెయిలు ఆశలు నిరాశలయ్యాయి. వారి జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకూ పొడిగించింది. గతంలో కోర్టు విధించిన కస్టడీ గురువారంతో ముగియడంతో పోలీసులు నిందితులను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనల తరువాత కస్టడీని పొడిగించారు.

చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)