Breaking News

దర్శన్ పశ్చాత్తాపం.. రేణుకాస్వామి భార్యకు సాయం చేయనున్నాడా..?

Published on Sat, 07/20/2024 - 15:48

చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ప్రముఖ హీరో దర్శన్‌కు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి తనకు అనుమతి ఇప్పించాలని ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అందుకు నిరాకరణ ఎదురుకావడంతో జైల్లో ఆయన ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఈ క్రమంలో దర్శన్‌లో పశ్చాత్తాపం కనిపిస్తుందని సమాచారం.

రేణుకాస్వామి  హత్య కేసులో  దర్శన్ రెండో ముద్దాయి కాగా, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. ఈ కేసుకు సంబంధించిన నిందితులందరూ నెల రోజుల నుంచి కటకటాల వెనుక ఉన్నారు. దర్శన్ సహా 13 మంది నిందితులు పరప్ప అగ్రహార జైలులో ఉండగా, నలుగురు నిందితులు తుమకూరు జైలులో ఉన్నారు.జైల్లో ఉన్న దర్శన్‌లో పశ్చాత్తాపం కనిపిస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జైలు అధికారులు కూడా ఇదే మాట అంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శన్‌ నుంచి వస్తున్న ప్రతి మాటలో కూడా పశ్చాత్తాపం కనిపిస్తుందని అంటున్నారు. రేణుకాస్వామి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు కాడంతో ఇప్పుడు ఆయన మరణం వల్ల కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న దర్శన్‌ కాస్త చలించిపోయినట్లు తెలుస్తోంది.

రేణుకాస్వామి కుటుంబ సభ్యులకు సహాయం అందించాలని దర్శన్‌ పూనుకున్నారట. ఈ విషయాన్ని రేణుకాస్వామి కుటుంబ సభ్యులతో దర్శన్‌ అనుచరులు చర్చించారట. అందుకు వారు కూడా అంగీకరించినట్లు సమాచారం. గర్భంతో ఉన్న రేణుకాస్వామి భార్యకు సాయం చేయడంతో పాటు  ఆయన తండ్రి, తల్లికి విడివిడిగా సాయం చేయాలని దర్శన్‌ ఆలోచించాడట. ఈ వార్త తన అనుచరుల ద్వారా కన్నడ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

దర్శన్‌ను పెళ్లికి ఆహ్వానించిన  'కాటేరా' దర్శకుడు
దర్శన్‌ను కలిసేందుకు 'కాటేరా' చిత్ర దర్శకుడు తరుణ్ సుధీర్ ఈరోజు పరప్ప అగ్రహార జైలుకు వెళ్లారు. దర్శన్‌ని కలిసిన అనంతరం  తరుణ్ సుధీర్ మీడియాతో ఇలా మాట్లాడారు.. 'దర్శన్ సర్‌కు ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నన్ను చూడగానే ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయనకు చెప్పాను. దర్శన్ సార్‌కు రెండు పుస్తకాలు ఇచ్చాను. జీవిత పాఠం గురించి తెలిపే పుస్తకంతో పాటు అర్జునుడి గురించి మరొక పుస్తకాన్ని ఆయనకు అందించాను.' అని తరుణ్ సుధీర్ అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)