Breaking News

రేణుకాస్వామి కేసులో దర్శన్, పవిత్రగౌడ నుంచి కీలక ఆధారాలు లభ్యం

Published on Mon, 07/08/2024 - 06:52

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న విధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. పక్కా ప్రణాళికతో పోలీసులు సాక్ష్యాధారాలు సేకరిస్తూ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్క వ్యక్తిని, వస్తువునీ వదలకుండా విచారణ చేసి, సాక్ష్యంగా మలచుకుంటున్నారు. తాజాగా ఈ హత్య కేసులో  నిందితుల వేలిముద్రలకు సంబంధించిన రిపోర్ట్‌ పోలీసుల చేతికి అందింది.

రేణుకాస్వామి హత్య జరిగిన ప్రాంతంతో పాటు మృతదేహాన్ని తరలించిన వాహనంలోని వేలి ముద్రలతో దర్శన్, పవిత్ర గౌడ వేలిముద్రలు మ్యాచ్‌ అయ్యాయి. వారిద్దరితో పాటు జైలులో ఉన్న మరో 10 మంది వేలి ముద్రలు కూడా సరిపోలాయి. హత్య జరిగిన చోట లభ్యమైన వేలిముద్రలను హైదరాబాద్‌, బెంగళూరులోని ఫోరెన్సిక్‌ ల్యాబ్స్‌కు అధికారులు పంపారు. అయితే, రెండు చోట్ల ఒకే రిపోర్ట్‌ వచ్చింది. ఇక డీఎన్‌ఏ రిపోర్ట్‌ రావాల్సి ఉంది.

రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన 17 మందిపై గతంలో పోలీసులు కేసులు ఉన్నాయి. వారిలో కొందరు హత్యలు కూడా చేసినట్లు తేలుతుంది. ఈక్రమంలో కామాక్షిపాళ్య పోలీసులు తాజాగా పీడబ్ల్యూడీ అధికారులకు బ్లూఫ్రింట్‌ తయారుచేసి ఇవ్వాలని లేఖ రాశారు. కామాక్షిపాళ్యలోని పట్టణగెరె మెకానిక్‌ షెడ్డు నుంచి రేణుకాస్వామి శవాన్ని ఏ మార్గాన తరలించారు? ఎక్కడ విసిరేసారు?, తర్వాత ఏ మార్గాల్లో ఎవరెవరు సంచరించారనే పూర్తి సమాచారం ఆధారంగా బ్లూ ఫ్రింట్‌ తయారు చేసి ఇవ్వాలని లేఖ రాశారు.

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు