Breaking News

ఇళయరాజా ముందు ధనుష్‌ భారీ డిమాండ్‌

Published on Wed, 06/19/2024 - 09:41

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ధనుష్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ‘ఇళయరాజా’ షూటింగ్‌ కార్యక్రమాన్ని కొద్దిరోజుల క్రితమే ‍ప్రారంభించారు. ఈ మూవీకి అరుణ్‌మాథేశ్వరన్  దర్శకుడు. కనెక్ట్‌ మీడియా, పీకే ప్రైమ్‌ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్‌ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే, ఈ సినిమాకు హీరో ధనుష్‌ భారీ రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' చిత్రం పట్ల భిన్న అభిప్రాయాలు వచ్చినప్పటికీ సినిమాపై మంచి టాక్‌ వచ్చింది. కానీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించినంతగా కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది.అయితే,  ధనుష్ మాత్రం తన పారితోషికాన్ని తగ్గించకుండా మరింత పెంచాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత తెలుగులో డైరెక్ట్‌ సినిమా ఒకటి ఆయన తీస్తున్న విషయం తెలిసిందే. శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో 'కుబేర' కోసం నాగార్జున, ధనుష్‌ కలిసి ఇందులో నటిస్తున్నారు. ఇదే వరుసలో రాయన్‌, ఇళయరాజా బయోపిక్‌ ఉంది. అయితే, ధనుష్‌ రెమ్యునరేషన్‌ భారీగా పెంచాడని తెలుస్తోంది. 

ఇళయరాజా సినిమా కోసం రూ. 50 కోట్ల రెమ్యునరేషన్‌ అడిగారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. అయితే, సినిమా కోసం కేవలం 50 రోజులకు మించి కాల్షిట్స్‌ ఇవ్వలేనని కూడా ఆయన ముందే చెప్పారట. ధనుష్ పారితోషికం రోజుకు కోటి రూపాయలకు పెరిగిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులు 100 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అయితే వారు ఒక్కో సినిమాకు కనీసం 70 రోజులకు పైగా కేటాయిస్తారని టాక్‌ ఉంది.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)