Breaking News

అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది: ఫరియా అబ్దుల్లా

Published on Sun, 02/02/2025 - 00:28

డ్యాన్స్ లవర్స్‌ను మెప్పించిన ‘డ్యాన్స్ ఐకాన్   సీజన్   1’(Dance Ikon) కు కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్   సీజన్   2(Dance Ikon 2) వైల్డ్‌ఫైర్‌’ రానుంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ షో ఆహా ఓటీటీలో ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. ఈ షోకు ఓంకార్(Ohmkar), హీరోయిన్   ఫరియా అబ్దుల్లా, శేఖర్‌ మాస్టర్‌ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. ‘డ్యాన్స్ ఐకాన్   2 వైల్డ్‌ఫైర్‌’ షోలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్‌ పాల్గొంటారని, హిప్‌ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్‌తో ఈ డ్యాన్స్ షో వీక్షకులను అలరిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘డ్యాన్స్ ఐకాన్   2’ షో ప్రెస్‌మీట్‌లో హోస్ట్స్‌లో ఒకరైన ఓంకార్‌ మాట్లాడుతూ– ‘‘డ్యాన్స్ ఐకాన్   2–వైల్డ్‌ఫైర్‌’లో ఐదుగురు కంటెస్టెంట్స్‌ సర్‌ప్రైజ్‌ చేస్తారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పెర్ఫార్మెన్స్లు చర్చనీయాంశమవుతాయి. ముగ్గురు హోస్ట్‌లతో పాటు సింగర్‌ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్‌ ఉంటారు. ‘డ్యాన్స్ ఐకాన్   2: వైల్డ్‌ ఫైర్‌’ వీక్షకులకు హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఇచ్చే కంప్లీట్‌ డ్యాన్స్ షో’’ అని అన్నారు.

ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ–‘‘డ్యాన్స్ ఐకాన్   సీజన్   1’కు కూడా నన్ను హోస్ట్‌గా అడిగారు. కానీ, ఆ సమయంలో చేయలేకపోయాను. ఇప్పుడు ఓంకార్, శేఖర్‌ మాస్టర్‌లతో కలిసి హోస్ట్‌ చేస్తుండటం సంతోషంగా ఉంది. ప్రతి ఎపిసోడ్‌ అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఈ షో వీక్షకులకు కంప్లీట్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఇస్తుందని గ్యారంటీగా చెప్పగలను’’ అని తెలిపారు. ‘‘ఈ షోలో వీక్షకులను సర్‌ప్రైజ్‌ చేసే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు ఉంటాయి’’ అని చె΄్పారు శేఖర్‌ మాస్టర్‌. ఈ కార్యక్రమంలో మెంటార్‌ యశ్, మెంటార్‌ మానస్, సింగర్‌ జాను లైరి, మెంటార్‌ ప్రకృతి మాట్లాడారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)