‘దహనం’మూవీ రివ్యూ

Published on Fri, 03/31/2023 - 17:30

టైటిల్‌: దహనం
నటీనటులు: ఆదిత్య ఓమ్‌, ఎఫ్‌ఎమ్‌ బాబాయ్‌, శాంతి చంద్ర తదితరులు
నిర్మాణ సంస్థ: ఓపెన్ ఫీల్డ్ మీడియా
నిర్మాత,సంగీతం : డాక్టర్ పెతకంశెట్టి సతీష్ కుమార్ 
దర్శకత్వం: ఆడారి మూర్తి సాయి 
విడుదల తేది: మార్చి 31, 2023

కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1984 ప్రాంతంలో జరుగుతుంది. విశాఖపట్నంలోని వాడరేవుల పల్లి గ్రామానికి చెందిన పూజారి భరద్వాజ శాస్త్రి(ఆదిత్య ఓమ్‌)కి శివ నామస్మరణ తప్ప మరొకటి తెలియదు. ఆ గ్రామంలోని శివాలయంలో పూజలు చేస్తూ భార్య, కూతురితో కలిసి ఉంటాడు. ఆ గుడి కిందే ఓ గుడిసెలో కాటికాపరి బైరాగి(ఎఫ్‌ఎం బాబాయ్‌) ఉంటాడు. తక్కువ జాతికి చెందిన అతను ఒక్కసారి అయినా ఆ గుడిలోని శివలింగాన్ని తాకాలనే కోరికతో ఉంటాడు.

అయితే ఆ శివాలయం తో పాటు చుట్టుపక్కల ఉన్న స్థలంపై భూస్వామి భూపతి కన్నపడుతుంది.  తమ పూర్వికులు ఉచితంగా కట్టించిన ఆ గుడిని వదిలి వెళ్లాలని పూజారి శాస్త్రీని బెదిరిస్తాడు. కానీ శాస్త్రీ కోర్టును ఆశ్రయిస్తాడు. మరి చివరకు గుడి ఎవరికి దక్కింది? శివ లింగాన్ని తాకాలనే బైరాగి కోరిక నెరవేరిందా? ఆయన చేసిన త్యాగమేంటి? కట్టుబాట్లు​, కుల వివక్ష కారణంగా బైరాగి, శాస్త్రీ జీవితాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయి? అనేదే ‘దహనం’ కథ. 

ఎలా ఉందంటే..
సినిమాలో ఒక సీన్‌లో శాస్త్రీ శివుడికి పూజ చేస్తూ పాలు లింగంపై పోస్తుంటాడు.. అదే సమయంలో అతని మనవడు తినడానికి తిండిలేక ఆకలితో ఏడుస్తుంటాడు. వెంటనే ఓ పిల్లాడు వెళ్లి లింగంపై పడి కిందపోతున్న పాలను చేతుల్లో పట్టి పిల్లాడికి తాగిస్తాడు. ఈ ఒక్క సీన్‌ చాలు ‘దహనం’ ఓ మంచి సందేశాత్మక చిత్రమని చెప్పడానికి. కులం, కట్టుబాట్లపేరుతో జరిగే అరచకాలను ఈ చిత్రంలో చూపించారు. కులాల పేరుతో మనుషులను వేరు వేరుగా చూడొద్దనే సందేశాన్ని ఇచ్చారు.

అయితే కులవివక్ష, వర్ణ వివక్షపై గతంలో చాలా సినిమాలు వచ్చాయి. దహనం కూడా ఆ తరహా చిత్రమే. కానీ శివాలయంతో ముడిపెట్టి కథనాన్ని నడిపించడం  ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. కట్టుబాట్లు, కులం కారణంగా శాస్త్రీ పస్తులుంటే.. బైరాగి కొడుకును దూరం చేసుకొవడం..ఇలా రెండు వర్గాలు పడే బాధలను చూపించారు. ఆకలికి అంటరానితనం ఉంటుందా? అలాంటి డైగాల్స్‌ ఆలోచింపచేస్తాయి. అయితే కథ నెమ్మదిగా, ఊహకందేలా సాగడం మైనస్‌. క్లైమాక్స్‌ మాత్రం కాస్త ఆసక్తికంగా ఉంటుంది. ఈ చిత్రం కమర్షియల్‌గా ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ.. ప్రేక్షకులకు మాత్రం మంచి సందేశాన్ని అందిస్తుంది. 

ఎవరెలా చేశారంటే..
ఇన్నాళ్లు లవర్‌ బాయ్‌గా కనిపించిన ఆదిత్య ఓమ్‌.. ఈచిత్రంలో విభిన్నమైన పాత్ర పోషించాడు. కాస్త వయసు మీద పడ్డ భరద్వాజ శాస్త్రి పాత్రలో ఆదిత్య ఒదిగిపోయాడు. ఆయన వాచకం, కట్టూబొట్టూ, నడవడికి అన్నీ కూడా చక్కగా కుదిరాయి. ఆదిత్య ఓమ్‌లోని మరో యాంగిల్‌ని ఈ చిత్రంలో చూడొచ్చు. ఆదిత్య తర్వాత బాగా పండిన పాత్ర ఎఫ్‌ఎం బాబాయ్‌ది. కాటికాపరి బైరాగి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తాగుబోతుగా ఆయన నటన.. చెప్పు డైలాగ్‌ ప్రతిదీ ఆకట్టుకుంటుంది.  భూపతి పాత్రకు  శాంతి చంద్ర న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.  సతీష్ కుమార్ సంగీతం బాగుంది. పాటలు సందర్భానుసారం వస్తాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)