Breaking News

ఈ కారణంతోనే విజయ్‌ ఆంటోనీ సినిమాను విడుదల చేస్తున్నా: సురేష్‌ బాబు

Published on Fri, 06/27/2025 - 11:46

కోలీవుడ్‌ హీరో విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) నటించిన కొత్త సినిమా 'మార్గన్‌' (Maargan) నేడు (జూన్‌ 27)న విడుదలైంది . లియో జాన్‌ పాల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో విజయ్‌ మేనల్లుడు అజయ్‌ ధీషన్‌ విలన్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.  మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సముద్రఖని, దీప్షిక తదితరులు కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత డి. సురేష్‌ బాబు విడుదల చేశారు. ఈ క్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

'మ్యూజిక్‌ డైరెక్టర్‌ నుంచి హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా విజయ్‌ ఆంటోనిగారి ప్రయాణాన్ని నేను చూస్తూనే ఉన్నాను. ఆయనకు సినిమాల పట్ల చాలా ప్యాషన్‌ ఉంది. నేను అలాంటివారు తీసే చిత్రాలని ఇష్టపడుతుంటాను. అందుకే ‘మార్గన్‌’ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాను' అని సురేష్‌ బాబు అన్నారు. సినిమా విడుదల  సందర్భంగా  ‘మార్గన్‌ ప్రీ రిలీజ్‌ లైవ్‌ ఇంటరాగేషన్‌’ అంటూ యూనిట్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ..  ‘‘సురేష్‌బాబుగారు మా సినిమాను రిలీజ్‌ చేస్తుండటమే మా తొలి సక్సెస్‌. ఇక ‘మార్గన్‌’ సాధారణ సీరియల్‌ కిల్లర్‌ చిత్రం కాదు. కథలో చాలా లేయర్స్‌ ఉన్నాయి. ఫస్ట్‌ నుంచి లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకు ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది.' అని అన్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తొలి ఆరు నిమిషాల మూవీని  చిత్ర యూనిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)