Breaking News

క్రేజీ గాసిప్‌.. ప్రశాంత్‌ నీల్‌తో విజయ్‌ దేవరకొండ సినిమా?

Published on Thu, 04/25/2024 - 16:39

లైగర్‌ సినిమా సక్సెస్‌ అయ్యి ఉంటే విజయ్‌ దేవరకొండ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయేవాడు. ఆ చిత్రం ప్లాప్‌ అయినప్పటికీ విజయ్‌ క్రేజీ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు కానీ పాన్‌ ఇండియా రేస్‌లో కాస్త వెనుకబడ్డాడు. ఒకే ఒక్క హిట్‌ వస్తే చాలు విజయ్‌తో సినిమా చేయడానికి కరణ్‌ జోహార్‌ మొదలు.. పాన్‌ ఇండియా దర్శకనిర్మాతలంతా రెడీగా ఉన్నారు.

కానీ విజయ్‌ బ్యాడ్‌ లక్‌ ఏంటంటే.. ఆయన నటించిన సినిమాలన్నింటికి మంచి పేరు వస్తుంది కానీ బాక్సాపీస్‌ వద్ద బోల్తా పడుతుంది. ఖుషి, ఫ్యామిలీ స్టార్‌.. రెండు మంచి చిత్రాలే కానీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పడు విజయ్‌ దృష్టి అంతా గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్ట్‌ పైనే ఉంది. ఈ చిత్రంలో ఎలాగైన హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు రౌడీ హీరో. గౌతమ్‌ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. విజయ్‌ని కలిశాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉండబోతుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విజయ్‌ కోసం ప్రశాంత్‌ ఓ కథ రెడీ చేశారట. ఇటీవల హైదరాబాద్‌కి వచ్చి విజయ్‌కి కథ వినిపించాడట. మరి ఆ కథేంటి? వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందా లేదా? అనేది త్వరలో తెలుస్తుంది. ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా ఉన్నప్పటికీ.. అది ఇప్పట్లో పట్టాలెక్కే చాన్స్‌ లేదు. ప్రశాంత్‌ ప్రస్తుతం సలార్‌ 2 ప్రీప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు విడుదలైన తర్వాతే ప్రశాంత్‌  మరో ప్రాజెక్ట్‌ని స్టార్ట్‌ చేస్తారు. 

సలార్‌ 2లో విజయ్‌ దేవరకొండ?
ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం సలార్‌. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.700 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా సలార్‌ శౌర్యంగపర్వం’ రూపుదిద్దుకోనుంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో విజయ్‌ దేవరకొండ గెస్ట్‌ రోల్‌లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాని కోసమే హైదరాబాద్‌కి వచ్చి విజయ్‌ని కలిశాడట ప్రశాంత్‌. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు కానీ ఈ క్రేజీ న్యూస్‌ మాత్రం నెట్టింట వైరల్‌ అవుతోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)