Breaking News

పాటలపై హక్కులెవరికి..? 

Published on Sun, 03/02/2025 - 05:06

సినిమా పాటల హక్కులు ఎవరివి అనే వివాదం చాలాకాలంగా చిత్ర పరిశ్రమలో నడుస్తోంది. సంగీతదర్శకుడు ఇళయరాజా ‘నా పాటపై హక్కు నాదే’ అంటుంటారు. కొందరు గాయనీగాయకులు తమకు రాయల్టీ రావాలంటున్నారు. కొందరైతే నిర్మాతలకే హక్కు అంటున్నారు. ఈ విషయంపై చెన్నైకి చెందిన ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ మార్క్‌ అసోసియేషన్‌ సహకారంతో క్రియాలా, ఐపీ అండ్‌ మ్యూజిక్‌ సంస్థలు శనివారం చెన్నైలో సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సులో నిర్మాత ధనుంజయన్, థింక్‌ మ్యూజిక్‌ ఇండియా సంతోష్, గాయకుడు హరిచరణ్‌ శ్రీనివాస్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. 

కాగా సినిమా పాటలు అనేక మాధ్యమాల ద్వారా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. అసలు వీటి హక్కులు ఎవరికి చెందుతాయి? అనే విషయం గురించి క్రియాలా సంస్థ నిర్వాహకుడు, న్యాయవాది ఎంఎస్‌. భరత్‌ మీడియా సమావేశంలో వివరిస్తూ... ఒక పాట రూపొందాలంటే సంగీత దర్ళకుడు, గీత రచయిత, గాయకుడు, సౌండ్‌ ఇంజినీర్‌.. ఇలా పలువురి కృషి ఉంటుందన్నారు. అయితే వీటన్నింటికీ మూలం నిర్మాత అనీ, ఆయన పెట్టుబడితోనే పాట రూపొందుతోందనీ, పాటలకు మొదటి హక్కుదారుడు నిర్మాతనే అని అన్నారు. ఒకవేళ ఒప్పందం ఉంటే, అందులోని నిబంధనల ప్రకారం హక్కులు వర్తిస్తాయన్నారు. ఎలాంటి ఒప్పందం లేకపోతే పాటల హక్కులు నిర్మాతకే ఉంటాయన్నారు. ఒకవేళ చిత్ర నిర్మాత కన్నుమూస్తే, ఆయన కుటుంబ సభ్యులకే హక్కులు చెందుతాయని భరత్‌ పేర్కొన్నారు. 

– ‘సాక్షి’ చెన్నై, తమిళ సినిమా

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)