Breaking News

కమెడియన్‌ యోగిబాబు ‘లక్కీ మ్యాన్‌’

Published on Tue, 02/07/2023 - 10:09

తమిళసినిమా: హీరోగా, కమెడియన్‌గా వరుస పెట్టి చిత్రాలు చేస్తున్న నటుడు యోగిబాబు. తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి లక్కీమ్యాన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో యోగిబాబు, వీర, రాచర్, రబేకా, అబ్దుల్‌ లీ, ఆర్‌ఎస్‌ శివాజీ, అమిత్‌ భార్గవ్, సాత్విక్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా థింక్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ వేణుగోపాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సందీప్‌ కే విజయ్‌ చాయాగ్రహణం, సాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ.. ఇది సమాజంలో జరుగుతున్న ఒక ప్రధాన సమస్యను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. అదే విధంగా కమర్షియల్‌ అంశాలతో ఫీల్‌గుడ్‌ మూవీగా ఉంటుందని చెప్పారు. అదృష్టవంతుడైన ఒక యువకుడు జీవితంలో అది ఎంతవరకు ఉంటుంది, దానిని నమ్ముకున్న అతని గమ్యం ఎటువైపు సాగుతుంది అన్న ఆసక్తికరమైన అంశాలతో ఉంటుందన్నారు.

ఈ పాత్రకు ప్రతిభావంతుడైన నటుడు అవసరమయ్యారని దీంతో నటుడు యోగిబాబు కరెక్ట్‌గా నప్పుతారని భావించి ఆయన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. చిత్రంలో ఆయనకు స్థాయికి తగ్గట్లుగా వినోదం ఉంటుందని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. కాగా చిత్రం పస్ట్‌లుక్‌ పోస్టర్‌ను  సోమవారం విడుదల చేసినట్లు దర్శకుడు తెలిపారు. త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)