ఇలాంటి టైమ్‌లో అలాంటి రిస్క్‌ తీసుకోను : కమెడియన్‌ సుదర్శన్‌

Published on Sun, 02/22/2026 - 15:58

చాలా మంది హాస్య నటులు తమకంటూ ఓ గుర్తింపు వచ్చిన తర్వాత హీరోలుగా చేశారు. నా కెరీర్‌ ఇప్పుడే ఊపందుకుంటోంది. ఇలాంటి సమయంలో అలాంటి రిస్క్‌ తీసుకోలేను.  ఒకవేళ నేను హీరోగా చేయాలంటే అది హీరోలు చేయలేని చిన్న చిన్న కాన్సెప్ట్‌లు చేయలేని సినిమాలు చేయాలి.  థియేటర్స్‌లో రిలీజ్‌ అయ్యే మెయిన్‌ లీడ్‌ సినిమాలు చేయాలని లేదు’ అని అన్నారు కమెడియన్‌ సుదర్శన్‌. సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుదర్శన్‌ ఓ కీలక పాత్ర పోషించి, తనదైన నటనతో మెప్పించాడు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కమెడిన్‌ సుదర్శన్‌ తాజాగా మీడియాతో ముచ్చటించారు.

→ 'హే బల్‌వంత్‌' లో మంచి క్యారెక్టర్‌ చేశాను. సినిమాకు చాలా క్రేజీ రెస్పాన్స్‌ వస్తోంది. నేను పోషించిన బంక పాత్రను ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. హిలేరియస్‌గా నవ్వుకుంటున్నారు. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉందని మంచి ప్రశంసలు వస్తున్నాయి.  డ్రింకింగ్‌ సీన్‌, వెన్నెల కిపోర్‌తో చేసిన ప్రకృతి చికిత్సాలయం సీన్స్‌కు థియేటర్స్‌కు ఊగిపోతున్నాయి. నా ప్రతి పంచ్‌తో పాటు సినిమాలో వెన్నెల కిషోర్‌, సుహాస్‌, నరేష్‌, సుహానీ అందరూ హిలేరియస్‌గా నవ్వించారు.

→ ఈ సినిమాలో నటించిన అందరితో నాకు అందరితో మంచి ర్యాపో ఉంది. ప్రతి సీన్‌కు అందరం మంచి సింక్‌లో ఉన్నాం. అందరూ క్లోజ్‌నెస్‌తో ఫ్లోతో సీన్‌లు బాగా వచ్చాయి


→ నేను హీరోగా వెండితెరపై ఇప్పుడే చేయను. అనుకోకుండా సినీ పరిశ్రమకు  వచ్చాం. కమెడియన్‌గా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాను. ఈ టైమ్‌లో రిస్క్‌ తీసుకోలేను. కమెడియన్‌గా నాకు అందరి హీరోలతో కలిసి సినిమాలు చేయాలని ఉంది. నటుడిగా సెటిల్‌ అయిపోయిన తరువాత హీరోగా  ఆలోచిద్దాం. ఒకవేళ హీరోగా చేస్తే చిన్న చిన్న కాన్సెప్ట్‌లతో చేసే ఓటీటీ సినిమాలు చేస్తాను.

→ ప్రస్తుతానికి వరుస సినిమాలతో బిజీగానే ఉన్నాను. కొన్ని సార్లు మంచి సినిమాలు కూడా వదులుకోవాల్సి ఉంది. కేవలం డేట్స్‌ క్లాష్‌ వల్ల దగ్గరికి వచ్చి పోతుంటాయి. తమిళంలో, కన్నడంలో కూడా ఆపర్లు వచ్చాయి.

→ కొత్త సినిమా విషయాలకొస్తే.. మృత్యుంజయతో పాటు, గొదావరి గట్టు మీద లో కూడా మంచి పాత్రలు చేశాను. త్వరలోనే అవి విడుదల కానున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)