Breaking News

స్టార్‌ డైరెక్టర్‌ సినిమా.. ఏడాదికి ముందే టికెట్లు విడుదల

Published on Thu, 07/17/2025 - 12:09

హాలీవుడ్‌ టాప్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌(Christopher Nolan) సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 2023లో ఓపెన్‌హైమర్ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకున్నారు. 96వ అకాడమీ అవార్డ్స్‌లో ఏకంగా ఏడు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డులను అందుకుంది. అయితే, ఈ చిత్రం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ది ఒడిస్సీ'(The Odyssey).. ఈ మూవీకి రచన, సహ-నిర్మాత కూడా క్రిస్టోఫర్‌ నోలన్‌ కావడం విశేషం.  ఒక ఎపిక్ యాక్షన్ ఫాంటసీ చిత్రంగా రెడీ అవుతున్న ఈ ప్రాజెక్ట్‌ 2026 జులై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, నేటి నుంచే టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

గ్రీకు కవి హోమర్ రాసినట్లు చెప్పబడే పురాతన ఇతిహాసం నుంచి ' ది ఒడిస్సీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మాట్ డామన్ హీరోగా నటిస్తున్నారు. ఇథాకా ద్వీపానికి గ్రీకు రాజుగా ఆయన నటించాడు. ప్రపంచంలోనే మొదటిసారి పూర్తిగా IMAX కెమెరాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రోజన్ యుద్ధం అనంతరం ఒడిస్సియస్ తన స్వదేశం ఇథాకాకు తిరిగి రావడానికి చేసే సాహసయాత్రను ఆధారంగా తీసుకుని, నోలన్ తనదైన శైలిలో మోడరన్ మానవతా విలువలతో ఈ మూవీలో మిళితం చేశారు. ఈ సినిమా కోసం రూ. 2100 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అలాంటి థియేటర్స్‌ 30 మాత్రమే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న IMAX 70mm టిక్కెట్ల ప్రీ-సేల్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది నోలన్ సినిమాలపై ఉన్న క్రేజ్‌ను సూచిస్తుంది. సినిమా విడుదల కావడానికి సరిగ్గా ఒక సంవత్సరం ముందే టిక్కెట్లు అమ్మకానికి వచ్చేశాయి. అయతే,  IMAX 70mm కోసం మాత్రమే ఈ టికెట్లు అందుబాటులో ఉండటంతె అభిమానులు నిరాశ చెందుతున్నారు. IMAX 70mm థియేటర్స్‌ ప్రపంచంలో కేవలం 30 మాత్రమే ఉన్నాయి. IMAX స్క్రీన్స్‌లో ఈ చిత్రాన్ని చూస్తే ప్రత్యేకమైన అనుభూతి ఉంటుందని నోలన్‌ చెప్పడంతో మరింత క్రేజ్‌ పెరిగింది. 

నోలన్‌ సినిమాలకు జులై సెంటిమెంట్‌
వార్నర్‌ బ్రదర్స్‌ కంపెనీతో నోలన్‌ ఎక్కువ సినిమాలు చేశారు. ఇప్పటి వరకు నోలన్‌ రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలను ఈ నిర్మాణ సంస్థే నిర్మించింది. నోలన్‌ తన సినిమాలను జూన్‌– జూలై సీజన్‌లో రిలీజ్‌ చేయడానికి ఇష్టపడతారు. ఆ సెంటిమెంట్‌నే మళ్లీ రిపీట్‌ చేశారు. నోలన్‌ గత ఆరు చిత్రాల్లో 5 సినిమాలు జూలైలో రిలీజ్‌ కావడం విశేషం. ఇప్పుడు ది ఒడస్సీ కూడా 2026 జులై 17న విడుదల కానుంది.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)