Breaking News

‘భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి వరకు పోరాడింది’

Published on Fri, 07/01/2022 - 16:43

ప్రముఖ నటి, సీనియర్‌ హీరోయిన్‌ మీనా భర్త విద్యాసాగర్‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలం ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. అయితే భర్తను బతికించుకునేందుకు మీనా ఎంతో ప్రయత్నించారని ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కళా మాస్టర్‌ తెలిపారు. విద్యాసాగర్‌ కరోనా బారిన పడకముందే ఆయనకు బర్డ్‌ ఇన్‌ఫెక్షన్‌ అయినట్లు వైద్యులు చెప్పారని ఆమె అన్నారు.

చదవండి: బెనారస్‌: మాయ గంగ సాంగ్‌ వచ్చేసింది

ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మీనా తన భర్తను కాపాడుకునేందుకు ఎంతో పరితపించారని ఆమె వివరించారు. ‘ఈ ఏడాది జనవరిలో కోరాన బారిన పడిన విద్యాసాగర్‌ అనంతరం కోలుకున్నారు. మీనా తల్లి బర్త్‌డే సందర్భంగా ఫిబ్రవరిలో వారి కుటుంబాన్ని కలిశాను. అప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఆ తర్వాత నెల రోజులకే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఏప్రిల్‌లో మీనా ఫోన్‌ చేసి విద్యాసాగర్‌ ఆరోగ్యం బాగా క్షీణించిందంటూ ఆవేదన చెందారు. దీంతో నేను ఆసుపత్రికి వెళ్లి ఆయనను పలకరించాను’ అంటూ చెప్పుకొచ్చారు. 

చదవండి: షికారు అందరికీ తెలిసిన కథే, తప్పకుండా నచ్చుతుంది

ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో వెంటనే ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి సాయం చేయాల్సిందిగా కోరామని, వారంతా సాయం చేసినా ట్రాన్స్‌ప్లాంట్ కోసం అవయవం దొరకలేదని తెలిపారు. ఈ క్రమంలో భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి క్షణం వరకు ప్రయత్నించారని, చిన్న వయసులోనే తను భర్తను కోల్పోవడం బాధాకరమని కళా మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)