Breaking News

ఏసీకి షార్ట్‌ సర్క్యూట్‌..కొరియోగ్రాఫర్‌ మృతి

Published on Thu, 05/08/2025 - 08:49

మణికొండ(హైదరాబాద్): గాఢ నిద్రలో ఉన్న ఓ కొరియోగ్రాఫర్‌ గదిలోని ఏసీకి షార్ట్‌ సర్క్యూట్‌ అయి మంటలు చెలరేగి, దట్టమైన పొగ పీల్చటంతో మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్, పుప్పాలగూడ శ్రీరాంనగర్‌ కాలనీలో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.

ఎస్‌ మునీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్‌ జిల్లాకు చెందిన పోరేటి వీరేందర్‌రెడ్డి (38) కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీరాంనగర్‌ కాలనీలోని కుతుబ్‌ ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌లోని 301 ప్లాట్‌లో నివాసం ఉంటున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి తన గదిలో వీరేందర్‌రెడ్డి నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో అతని గదిలోని ఏసీకి షార్ట్‌ సర్క్యూట్‌ కావటంతో మంటలు చెలరేగాయి. దుస్తులు, ఫర్నిచర్ కాలిపోయి పొగలు వ్యాపించాయి.

గమనించిన చుట్టు పక్కల వారు డయల్‌ 100 ద్వారా పోలీసు, అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలార్పి గదిలోకి వెళ్లగా వీరేందర్‌రెడ్డి అపస్మారక స్థితిలో కనిపించాడు. సీపీఆర్‌ చేసినా అప్పటికే దట్టమైన పొగను పీల్చటంతో మృతి చెందినట్టు 108 సిబ్బంది ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించామని, షార్ట్‌ సర్క్యూట్‌ కారణాలను తెలపాలని విద్యుత్‌ శాఖకు లేఖ రాశామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)