Breaking News

విక్రమ్‌ 'వీర ధీర శూరన్‌' సాంగ్‌ విడుదల

Published on Fri, 03/07/2025 - 10:50

చియాన్‌ విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న 62వ చిత్రం వీర ధీర శూరన్‌. నటి దుషార విజయన్‌ నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హెచ్‌ఆర్‌ పిక్చర్స్‌ పతాకంపై హెచ్‌ఆర్‌ రియా శింబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సేతుపతి, చిత్తా చిత్రాల ఫేమ్‌ అరుణ్‌ కుమార్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్స్‌ కథా చిత్రంగా రూపొందుతోంది. విక్రమ్‌ కాళీ అనే గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న వీర ధీర శూరన్‌ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. 

కాగా చిత్ర టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ లను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను తెచ్చుకున్నాయి. అదేవిధంగా ఇంతకుముందు చిత్రంలోని కల్లూరుమ్‌ కార్తీ ౠన్‌ మేల్‌ అనే పల్లవితో సాగే పాటలు విడుదల చేశారు. దీనికి విశేష ఆదరణ లభించింది. పక్కా కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కుతున్న వీర ధీర శూరన్‌ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. కాగా తాజాగా ఆది అడి ఆది అనే పల్లవితో సాగి రెండవ పాటను చిత్ర వర్గాలు గురువారం విడుదల చేయనున్నారు. ఫైవ్‌ స్టార్‌ పిక్చర్స్‌ సెంథిల్‌ పొందడం విశేషం. చిత్రం సమ్మర్‌ స్పెషల్‌ విడుదలకు ముస్తాబవుతోంది.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)