Breaking News

కోబ్రా ఆడియో లాంచ్‌లో విక్రమ్‌ సందడి, పుకార్లపై ఫన్నీ రియాక్షన్‌

Published on Tue, 07/12/2022 - 12:10

తమిళ హీరో చియాన్‌ విక్రమ్‌ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఆయనకు ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో చికిత్స నిమిత్తం ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. అక్కడ రెండు రోజుల పాటు ఐసీయూలో చికిత్స తీసుకున్న ఆయన శనివారం డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం విక్రమ్‌ ఆరోగ్యం నిలకడ ఉంది. అయితే మొదట ఆయనకు గుండెపోటు వచ్చిందంటూ తమిళ మీడియా, వెబ్‌సైట్లలో కథనాలు వచ్చాయి. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఆందోళనకు గరయ్యారు.

చదవండి: సమంత యశోద మూవీ షూటింగ్‌ పూర్తి, రిలీజ్‌ డేట్‌ ఖరారు

ఇక ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కావేరి ఆస‍్పత్రి వైద్యులు, ఆయన తనయుడు ధృవ్‌ కొట్టిపారేశారు. ఆయనకు గుండెపోటు రాలేదని, చాతి భాగంలో స్వల్స అస్వస్థత కారణంగా ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఫ్యాన్స్‌ అంతా ఊపిరి పిల్చుకున్నారు. ఇదిలా ఉంటే నిన్న(జూలై 11న) జరిగిన కోబ్రా మూవీ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌లో విక్రమ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లపై స్పందించాడు. స్టేజ్‌పై మాట్లాడుతుండగా  విక్రమ్‌ తన చాతిపై చేయి వేసుకున్నాడు. దీంతో ‘నాకు తెలియకుండానే చాతిపై చేయి వేసుకున్నాను. దీన్ని కూడా గుండెపోటు అంటారేమో’ అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేశాడు.

చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది: సాయి పల్లవి

అనంతరం రీసెంట్‌గా తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలన్ని పుకార్లేనన్నారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. తనకు వచ్చింది గుండెపోటు కాదని స్పష్టం చేసేందుకే కోబ్రా ఆడియో లాంచ్‌కు వచ్చానని విక్రమ్‌ చెప్పారు. అంతేకాక కాస్తా అస్వస్థతగా అనిపించడంతో హాస్పిటల్‌కు వెళ్లానన్నారు. ఇక తనపై చూపించిన ప్రేమకు ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు విక్రమ్‌. కాగా విక్రమ్‌ హీరోగా అజయ్‌ జ్ఞానముత్తు యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా కోబ్రాను తెరకెక్కించారు. ఈ మూవీ ఆగస్ట్‌ 11న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. కాగా ఇందులో ‘కేజీయఫ్‌’ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ విలన్‌గా కనిపించనున్నాడు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)