Breaking News

మహేష్ బాబుతో నటించాలన్నదే నా చిరకాల కోరిక..

Published on Wed, 11/06/2024 - 10:07

 సీతమ్మధార(విశాఖ):  అటు అందం.. ఇటు అభినయం కలగలిపిన విశాఖ సోయగం హేమలతారెడ్డి.. గ్లామర్‌ ఫీల్డ్‌లో పాదరసంలా దూసుకుపోతున్నారు. బుల్లితెర, వెండితెర, ఫ్యాషన్‌ రంగాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పలు టీవీ చానళ్లలో యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ వచ్చారు. అటు సీరియళ్లు, సినిమాలు.. ఇటు ఫ్యాషన్‌ రంగంలో విజయాలతో తన కలలను సాకారం చేసుకుంటున్నారు. వెండితెరపై నా పేరుండాలి.. నా నటన అందరూ గుర్తు పెట్టుకోవాలి.. అని అంటున్న ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు.      

విశాఖలోనే ఓనమాలు 
విశాఖ నటనలో నాకు ఓనమాలు నేర్పింది. ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నా.. ఇప్పుడీస్థాయిలో ఉండడానికి కారణం నా తల్లిదండ్రులే. డాబాగార్డెన్స్‌లో ఉంటున్నాం. నాన్న సూర్య దేవర వెంకటరావు నేవీలో పనిచేసి రిటైరయ్యారు. ఇక్కడే సెటిల్‌ అయ్యారు. చదువుంతా సెయింట్‌ జోసెఫ్‌ విద్యాసంస్థలో సాగింది. తాను ఇంటర్‌ వరకు అక్కడే చదివా. తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ క్లాసికల్‌ చేశా. తల్లి ధనలక్ష్మి ఫైనాన్స్‌ వ్యాపారం.

న్యూస్‌రీడర్‌ నుంచి హీరోయిన్‌ వరకు.. 
నాన్న నన్ను న్యూస్‌ రీడర్‌గా చూడాలనుకున్నారు. ముందుగా టీవీ 9, తర్వాత ఎన్‌టీవీలో ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలు చేశా. ఎందరో హీరోయిన్లను ఇంటర్వ్యూ చేశా. జెమిని టీవీలో సినిమా న్యూస్‌రీడర్‌గా చేశా. మంచు విష్ణు నిర్మించిన హ్యాపీడేస్‌ సీరియల్‌లో కల్యాణి పాత్రలో నటించా. ఆ సీరియల్‌కు, అందులో నా పాత్రకు మంచి ఆదరణ లభించింది. అంతఃపురం, క్రైమ్‌ తదితర సీరియల్స్‌ చేశాను. జెమిని, మా టీవిలో నేను నటించిన సీరియల్స్‌ ప్రసారమయ్యాయి. 

నేను ఇప్పటివరకు సుమారుగా 20 వరకు సీరియల్స్‌లో నటించాను. గతంలో విశాఖ బిగ్‌ ఎఫ్‌ఎంలో జాబ్‌ కోసం ట్రై చేశా. ఇప్పుడు అదే ఎఫ్‌ఎంలో నన్ను ఇంటర్వ్యూ అడగడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్ బాబుతో నటించాలన్నదే నా చిరకాల కోరిక. సౌందర్య, సమంత తన అభిమాన హీరోయిన్లు. తెలుగు హీరోయిన్లు అంజలి, వైష్ణవి సినిమాల్లో రాణిస్తున్నారు. వారి లాగే నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. వీరభద్ర క్రియేషన్స్‌ పేరిట సొంత బ్యానర్‌ 2017లో ప్రారంభించాను.

గ్లామర్‌ ఆన్‌ మిసెస్‌ ఇండియా అవార్డుతో 
విశాఖలో జని్మంచిన పోతురెడ్డి హేమలతా రెడ్డి మలేసియాలో జరిగిన గ్లామ్‌ ఆన్‌ మిసెస్‌ ఇండియాగా నిలిచారు. మొదట లోకల్‌ టీవీ, జెమినీ టీవీ యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత పలు షోలో పాల్గొన్నారు. హ్యాపీడేస్‌ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ చేసి బుల్లితెర ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. అనంతరం హీరో జగపతిబాబుతో ప్రవరాఖ్యుడు సినిమాలో నటించారు. అందులో హేమలతా రెడ్డి హీరోయిన్‌ ప్రియమణి స్నేహితురాలిగా నటించారు. నిన్నే చూసి సినిమాలో హీరోయిన్‌గా నటించి నిర్మాతగా వ్వవహరించారు. అక్కడ నుంచి మిసెస్‌ ఇండియా పోటీలో విశాఖ నుంచి ప్రాతినిథ్యం వహించి ప్రపంచ వ్యాప్తంగా 300 మందిలో విజేతగా నిలిచారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు