Breaking News

చిరంజీవి మెసేజ్‌లను అవాయిడ్‌ చేసిన సుమ! అసలేం జరిగిందంటే..

Published on Mon, 01/16/2023 - 11:53

మెగాస్టార్‌ చిరంజీవి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. సామాన్య ప్రజలే కాదు సినీ సెలబ్రెటీల్లో సైతం ఆయనను అభిమానించే వారు ఎందరో ఉన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండ ఇండస్ట్రీ స్వయంగా కృషితో ఎదిగి ఆశేష అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆయన పలకరిస్తే చాలు, ఆయనతో ఒక్క మాట మాట్లాడితే చాలు అని అభిమానుల ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. ఇక చిరంజీవితో సినిమా చేయడమంటే దర్శక-నిర్మాతలు, నటీనటులు అదృష్టంగా భావిస్తారు. అలాంటి మెగాస్టారే స్వయంగా మెసేజ్‌ చేస్తే ఓ స్టార్‌ యాంకర్‌ అవాయిడ్‌ చేసిందట. ఆమె మరెవరో కాదు యాంకర్‌ సుమ కనకాల.

చదవండి: చిరంజీవి మెసేజ్‌లను అవైయిడ్‌ చేసిన సుమ! అసలేం జరిగిందంటే..

మూడు, నాలుగేళ్లు వరుసగా సుమకు మెసేజ్‌ చేస్తే కనీసం రిప్లై కూడా ఇవ్వలేదని చిరు తాజాగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. ఇంతకి అసలేం జరిగిందంటే.. చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సక్సెస్‌ జోష్‌లో ఉన్న చిరంజీవి సుమ హోస్ట్‌ చేస్తున్న ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలో పాల్గొన్నారు. చిరంజీవితో పాటు డైరెక్టర్‌ బాబీ, నటుడు వెన్నెల కిషోర్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమ చిరు లీక్స్‌లో ఏమైనా లీక్స్‌ ఉన్నాయా! అని అడగ్గా.. ఏకంగా సుమకే ఎసరు పెట్టారు చిరంజీవి. సుమ గురించి ఓ విషయం లీక్‌ చేస్తున్నానంటూ అసలు విషయం చెప్పారు.

చదవండి: రష్మిక టాటూ అర్థమెంటో తెలుసా? దాని వెనక ఇంత స్టోరీ ఉందా!

‘‘మూడు, నాలుగేళ్లుగా సుమకు హ్యాపీ బర్త్‌డే, గార్డ్‌ బ్లెస్‌ యూ, స్టే బ్లెస్డ్‌’ అంటూ సుమకు మెసేజ్‌లు పెడుతూనే ఉన్నాను. కానీ కనీసం ఆమె రిప్లై కూడా ఇవ్వలేదు. చిరంజీవి మెసేజ్‌ చేస్తే రిప్లై ఇవ్వని ఎకైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే అది సుమనే’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సుమ స్పందిస్తూ.. ఏకంగా చిరంజీవి గారు మెసేజ్‌ చేస్తారని తాను అసలు ఊహించలేదని, కనీసం నెంబర్‌ కూడా క్రాస్‌ చెక్‌ చేసుకోలేదని వివరణ ఇచ్చింది. అనంతరం చిరు మాట్లాడుతూ.. 2022లో ఓ ఈవెంట్లో సుమ కలిసినప్పుడు ఇలా మెసేజ్‌ చేశానని చెప్పగానే తాను చాలా సంతోషించిందన్నారు. అంతేకాదు సారీ కూడా చెప్పి నెంబర్‌ తీసుకుందని ఆయన చెప్పారు.  

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)