Breaking News

చిరంజీవి కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.. వివరాలు ఇవే

Published on Tue, 08/22/2023 - 07:20

భారీ అంచనాల మధ్య విడుదలైన భోళా శంక‌ర్ చిరంజీవి కెరియర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. దీంతో చిరంజీవి కొంత గ్యాప్‌ తీసుకుని తన త‌న త‌దుప‌రి సినిమాల విష‌యంలో నిర్ణయం తీసుకుంటాడని సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. వరుస పరాజయల తర్వాత కొంత బ్రేక్ తీసుకొన్న త‌ర‌వాతే.. కొత్త సినిమా ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని వార్త‌లొచ్చాయి. అయితే, మెగాస్టార్‌ ప్ర‌ణాళిక‌ల్లో ఎలాంటి మార్పూ లేదని, ఇలాంటి ఒడిదుడుకులు సహజమేనని ఈ ప్రకటనతో చిరంజీవి తెలిపారని చెప్పవచ్చు.

(ఇదీ చదవండి: ఆ సినిమా కోసం అనిరుధ్‌ మ్యూజిక్‌తో పాటు ఆరుగురు వరల్డ్‌ ఫేమస్‌ ఫైట్‌ మాస్టర్స్‌)

ముందుగా అనుకొన్న‌ట్టుగానే త‌న పుట్టిన రోజున నేడు (ఆగష్టు 22) కొత్త సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చేస్తోంది. దానిలో భాగంగానే కొన్నిగంటల క్రితం యూవీ క్రియేషన్స్‌ ట్విటర్‌ ద్వారా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. భోళా శంకర్‌ డిజాస్టర్‌ తర్వాత చిరంజీవి చెయబోయే సినిమా ఎవరితో ఉంటుందా అని ఫ్యాన్స్‌ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా యూవీ క్రియేషన్స్‌ అధికారికంగా సోషల్‌మీడియాలో ఒక పోస్టర్‌తో గుడ్‌న్యూస్‌ తెలిపింది. నేడు 10:53 నిమిషాలకు మెగాస్టార్‌ మూవీకి చెందిన పలు వివరాలను ప్రకటిస్తామని వారు వెల్లడించారు.

యూవీ క్రియేషన్స్‌-చిరంజీవి కాంబినేషన్‌లో వస్తున్న ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌తో  బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ మెగాఫోన్‌ పట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.  

(ఇదీ చదవండి: ఫైనల్‌గా వశిష్ఠకే దక్కిన మెగా 157 ప్రాజెక్ట్‌)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)