Breaking News

గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం.. మన్మోహన్‌ సింగ్‌ మృతిపై సినీ ప్రముఖులు

Published on Fri, 12/27/2024 - 13:03

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ (92) తుదిశ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కన్నుమూశారు. నెహ్రూ, ఇందిర, మోదీ తర్వాత అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ప్రపంచమే మెచ్చిన ఆర్థికవేత్తగా ఆయన పేరు పొందారు. ఆర్థిక మంత్రిగా దేశాన్ని సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించిన మేధావిగా ఎప్పటికీ గుర్తుంటారు. మన్మోహన్‌ సింగ్‌ మృతిపై  సినీ ప్రముఖులు చిరంజీవి, కమల్‌ హాసన్‌ సంతాపం తెలిపారు. వారికి  ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎక్స్‌ వేదికగా తెలిపారు.

చిరంజీవి తన ఎక్స్‌ పేజీలో ఇలా పంచుకున్నారు. 'మన దేశంలో గొప్ప రాజనీతిజ్ఞులలో మన్మోహన్‌సింగ్‌ ఒకరు. ఆయన ఉన్నత విద్యావంతులు, అత్యంత మృదుస్వభావి, వినయపూర్వకమైన నాయకుడు  మన్మోహన్ సింగ్. ఆర్థిక మంత్రిగా అతని దార్శనికత దేశానికి ఎంతో ఉపయోగపడింది. వరుసగా రెండు పర్యాయాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఆయన చరిత్రలో నిలిచిపోయే మార్పులు తెచ్చారు. అలాంటి మహానుభావుడి హయాంలో పార్లమెంట్‌ సభ్యుడిగా, పర్యటక శాఖ సహాయ మంత్రిగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.  ఆయన నుంచి నేను చాలా విషయాలను నేర్చుకున్నాను. ఆయన మరణం మన దేశానికి తీరని నష్టం. మన్మోహన్‌సింగ్‌ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి !!' అంటూ చిరు పేర్కొన్నారు.

తమిళ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ కూడా మన్మోహన్‌సింగ్‌కు సంతాపం తెలిపారు. ' భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. నిశ్శబ్ద గౌరవం కలిగిన వ్యక్తి, అతను తన దూరదృష్టితో కూడిన ఆర్థిక, సామాజిక విధానాల ద్వారా దేశాన్ని పునర్నిర్మించారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు లక్షలాది మందికి ఉపయోగపడ్డాయి.  భారతదేశం పురోగతి విషయంలో సమాజంలోని ప్రతి మూలకు ప్రభుత్వ లక్ష్యాలు చేరేలా నిర్ధారిస్తూ.. సమగ్రత, సామాజిక న్యాయం పట్ల లోతైన నిబద్ధతతో అతని పాలన కొనసాగింది. ఆయన వారసత్వం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' కమల్‌ హాసన్‌ పేర్కొన్నారు.

మాజీ ప్రధానికి మోహన్ బాబు సంతాపం..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల టాలీవుడ్ నటుడు మోహన్ బాబు సంతాపం తెలిపారు. ఆయన గొప్ప దార్శనికత కలిగిన నాయకుడని కొనియాడారు. అసాధారణ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ మరణించడం బాధాకరమని.. ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా భారతదేశ ఆర్థిక రంగంపై చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. రాజ్యసభలో ఆయనతో కలిసి పనిచేసిన ఘనత నాకు దక్కడం అదృష్టమన్నారు.  ఆయన తెలివితేటలు, రాజనీతిజ్ఞత అందరికీ స్ఫూర్తినిచ్చాయని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)