Breaking News

అతడి కంటే అందగాడివా అని హేళన చేశారు: చిరంజీవి

Published on Fri, 02/10/2023 - 12:32

ప్రముఖ సింగర్‌ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్‌ స్మిత’ టాక్‌ షో ప్రారంభమైంది. ఈ షో ద్వారా సినీ, రాజకీయ ప్రముఖుల జీవితంలోని చోటు చేసుకున్న సంఘటనలు, వ్యక్తిగత విషయాలను చర్చించనున్నారు.  ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీలివ్‌లో వేదికగా ప్రసారమయ్యే ఈ షో ప్రోమోలో మెగాస్టార్‌ చిరంజీవి, హీరోయిన్‌ సాయి పల్లవి, దగ్గుబాటి రానా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు తదితరులు పాల్గొన్నట్లు చూపించారు. ఇక ఫిబ్రవరి 10న ఈ షో ప్రారంభం కాగా తొలి ఎపిసోడ్‌గా మెగాస్టార్‌ చిరంజీవి ఇంటర్య్వూను ప్రసారం చేశారు.

చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. సింగర్‌ యశస్వి చీటింగ్‌ బట్టబయలు!

ఇందులో చిరు తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి తన కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటూ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘నేను నటుడిగా ఈ స్థాయి చేరుకునే క్రమంలో ఎన్నో అవమానాలు పడ్డాను. అవకాశాల కోసం వెళితే హేళన చేశారు. కొన్ని సార్లు అయితే మానసిక క్షోభకు గురయ్యాను. ఆ బాధను ఎవరికి చెప్పుకోలేదు.

దేవుడి ముందుకు నిలబడి నాకు నేను ధైర్యం చెప్పుకునేవాడిని. ఆ తర్వాత మళ్లీ అవకాశాల వేట మొదలు పెట్టేవాడిని’ అని చెప్పారు. అయితే ‘‘సినిమాల్లో నటించాలనే ఆశతో ఓ రోజు మద్రాస్‌కు వెళ్లాను. పాండీబజార్‌లోని ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లా. అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి ‘ఏంటి ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లోకి వచ్చావా? సినిమాలు ట్రై చేద్దామనే! అతను చూడు ఎంత అందంగా ఉన్నాడో. అతడి కంటే నువ్వు అందగాడివా.. తెలిసిన వాళ్లు లేకపోతే అవకాశాలు దొరకడం కష్టం. ఇండస్ట్రలోకి రావాలంటే ఇక్కడ తెలిసిన వాళ్లు ఉండాలి.

చదవండి: ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి యాంకర్‌ రష్మీ? భారీగా పారితోషికం..!

కాబట్టి నీ కల మర్చిపో’ అంటూ నన్ను హేళన చేస్తూ మాట్లాడాడు. ఆ మాటలు నన్ను బాధించాయి. ఇంటికి వెళ్లి దేవుడు ముందు కూర్చోని ఇలాంటి వాటికి బెదిరి వెనకడుగు వేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇక ఆ తర్వాత ఏడాది పాటు పాండీ బజార్‌ వైపు  వెళ్లలేదు’’ అంటూ చిరు చెప్పుకొచ్చారు. కాగా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరు మొదట క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా మెప్పించారు. అలా అంచెలంచెలుగా హీరోగా స్వయం కృషితో ఎదిగిన చిరు ప్రస్తుతం సినీరంగంలో గాడ్‌ఫాదర్‌గా అభిమానుల గౌరవ, అభిమానాలను అందుకుంటున్నారు. 

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)