Breaking News

చిరు కొత్త సినిమా ప్రకటన.. సూపర్‌ హిట్‌ డైరెక్టర్‌కు ఛాన్స్‌

Published on Sun, 08/13/2023 - 14:17

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈ శుక్రవారం (ఆగస్టు 11) రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి నెగెటివ్ టాక్‌ను తెచ్చు​కుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోవచ్చు. అంతేకాకుండా చిత్ర నిర్మాతలకు భారీగా నష్టాలు రావడం ఖాయం అని తెలుస్తోంది. ముఖ్యంగా మెహర్ రమేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఔట్‍డేటెడ్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అతనిపై భారీగా ట్రోల్స్‌ కూడా వస్తున్నాయి. థియేటర్ల వద్దే ఆయనపై పలు వ్యాఖ్యలతో ఫ్యాన్స్‌ విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి తర్వాత సినిమాకు  డైరెక్ట్‌ చేయాలంటే చాలా ఘట్స్‌ ఉండాల్సిందే. వాల్తేరు వీరయ్య మినహా వరసు ప్లాపులతో ఉన్న చిరుకు ఖచ్చితంగా భారీ హిట్‌ అవసరం ఎంతైనా ఉంది.  

ఇలాంటి సమయంలో చిరంజీవి తర్వాత చేయనున్న ఓ సినిమాపై తాజాగా సమాచారం బయటికి వచ్చింది. తన 157వ చిత్రాన్ని సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో మెగాస్టార్ చేయనున్నారు.  బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుంది. తాజాగా, ఈ మూవీ షూటింగ్ ప్రారంభం గురించి సమాచారం బయటికి వచ్చింది.

ఎప్పుడు ప్రారంభం
చిరంజీవి - డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్‍లో ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ షూటింగ్ ఈ ఏడాది నవంబర్‌లో మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం డేట్లను కూడా మెగాస్టార్ కేటాయించారట. ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్‍ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కెరీర్‌లో మైలురాయి చిత్రంగా నిలిచిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' తరహాలోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. 

ఈ రీమేక్‌ సంగతేంటి..?
ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా కంటే ముందు మలయాళ సినిమా 'బ్రో డాడీ' రీమేక్‍ మూవీని చిరంజీవి మొదలుపెడతారని తెలుస్తోంది. 'సోగ్గాడే చిన్ననాయన, బంగార్రాజు మూవీస్ ఫేమ్ కల్యాణ్ కృష్ణ ఈ మెగా156 చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇప్పుడు భోళా శంకర్‌ దెబ్బతో ఈ ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్లడం కష్టమేనని సమచారం. ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్స్ వరసగా రీమేక్స్ సినిమాలే చేస్తుండటంతో సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు కూడా కొంతమేరకు అసహనానికి గురౌతున్నారు.  

దీంతో బ్రో డాడీని పక్కనబెట్టి... సోషియో ఫ్యాంటసీ సినిమాకే చిరు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. గతంలో రజనీ,కమల్‌ వంటి వారికి కంటిన్వ్యూగా ప్లాప్‌లు వచ్చాయి. తర్వాత వారిద్దరికి జైలర్‌,విక్రమ్‌ సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద వారి స్టామినా ఎంటో చూపించాయి. ఇలాగే చిరుకు ఒక్క సినిమా పడితే చాలు టాలీవుడ్‌లో తన సత్తా ఎంటో చెబుతుందని ఫ్యాన్స్‌ అంటున్నారు.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)