Breaking News

‘విడుదల–2’ పదిరెట్లు అద్భుతంగా ఉంటుంది

Published on Thu, 12/19/2024 - 11:54

‘‘విడుదల–1’లో కేవలం పాత్రలు ఎస్టాబ్లిష్‌ మాత్రమే జరిగింది. అయితే కథ అంతా ‘విడుదల–2’ లోనే ఉంటుంది. మొదటి భాగానికి మించి పదిరెట్లు అద్భుతంగా రెండో భాగం ఉంటుంది. ఇందులో పెరుమాళ్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి అద్భుతమైన నటన, భావోద్వేగాలు చూస్తారు’’ అని నిర్మాత చింతపల్లి రామారావు అన్నారు. 

విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో, సూరి, మంజు వారియర్, సూరి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘విడుదల–2’. వెట్రిమారన్‌ దర్శకత్వంలో ఎల్‌రెడ్‌ కుమార్‌ నిర్మించిన ఈ మూవీ తమిళ్, తెలుగులో ఈ నెల 20న  విడుదల కానుంది. శ్రీ వేధాక్షర మూవీస్‌ అధినేత చింతపల్లి రామారావు తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా చింతపల్ల రామారావు మాట్లాడుతూ– ‘‘అణగారిన వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం.. పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి ప్రజల్ని ఎలా బయటపడేలా చేశారు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలతో తీసిన చిత్రమిది. ఇళయరాజాగారి నేపథ్య సంగీతం ప్రాణంగా నిలుస్తుంది. నేను నిర్మించిన ‘శ్రీ శ్రీ రాజావారు’ చిత్రం రిలీజ్‌ కానుంది. త్వరలోనే ‘డ్రీమ్‌ గర్ల్‌’ అనే మూవీని ప్రారంభించబోతున్నాం. మరో రెండు సినిమాలు సెట్స్‌ మీదకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి’’ అని తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)