Breaking News

'త్రిషకు సారీ చెప్పాలి.. మరి సంస్కారం ఆయనకు ఉందో లేదో'

Published on Tue, 08/04/2026 - 12:40

ఒకప్పుడు తమిళ సినిమాల్లో హీరోగా చేసి ప్రస్తుతం తమిళనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్.. హీరోయిన్ త్రిషపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కావేరి జలాల వివాదంపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు త్రిషని ఉద్దేశించి చేసినవేనని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయనపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. ఈ సందర్భంగా సింగర్ చిన్మయి, నటి-రాజకీయ నాయకురాలు ఖుష్బూ.. ఉదయనిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. రాజకీయ విభేదాల కోసం మహిళలని లక్ష్యంగా చేసుకోవడం సరికాదు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడింది నాకు మొదట అర్థం కాలేదు. తెలిసిన ఒకరు వివరించిన తర్వాతే అది అర్థమైంది. మొదట నేను నీటి కనెక్షన్ గురించి అనుకున్నా. చాలా మంది మహిళలకు కూడా అదే అనిపించింది. కానీ అది మహిళలని కించపరిచేలా ఉందని తర్వాత తెలిసింది. నినాదాలు చేసిన టైంలో ఎదురుగా ఉన్న జనాల్ని ఆపాల్సింది పోయి, మరింత అభ్యంతరకరంగా మాట్లాడటం నిరాశ కలిగించింది. గతంలో జయలలితపై కూడా ఇలాంటి అసభ్య వ్యాఖ్యలే చేశారని, అయితే కొత్తతరం నాయకుల నుంచి మెరుగైన రాజకీయ సంస్కృతి ఆశించామని, కానీ అది కనిపించలేదని చిన్మయి ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.

ఖుష్బూ కూడా ఉదయనిధి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించింది. అసభ్యకరంగా, చౌకబారుగా, మహిళలని అవమానించేలా ఆయన స్పీచ్ ఉందని చెప్పుకొచ్చింది. రాజకీయ విభేదాలు ఉన్నాయని మహిళలని అవమానించే హక్కు ఎవరికీ లేదు. మహిళల గౌరవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం బలిపశువుగా మార్చకూడదు. త్రిషకు ఉదయనిధి స్టాలిన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఖుష్బూ డిమాండ్ చేసింది. చేసిన పనికి బాధ్యత వహించి క్షమాపణ చెప్పే ధైర్యం, సంస్కారం ఆయనకు ఉందో లేదో చూడాలని ఉదయనిధిని ఎద్దేవా చేసింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)