Breaking News

'ఛావా' తెలుగు వర్షన్‌.. రెండో రోజు కలెక్షన్ల జోరు

Published on Sun, 03/09/2025 - 12:00

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమా 'ఛావా' తెలుగులో కూడా సత్తా చాటుతుంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్‌, రష్మిక ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించారు.  ఫిబ్రవరి 14న హిందీ వర్షన్‌లో మాత్రమే విడుదలైన ఈ మూవీ తెలుగు డబ్బింగ్‌లో మార్చి 7న థియేటర్స్‌లోకి వచ్చేసింది.  ఈ ఏడాది బాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఛావా రికార్డు నెలకొల్పింది. మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైనప్పటికీ కలెక్షన్స్‌ పరంగా దుమ్మురేపుతుంది.

ఛావా సినిమా తెలుగు వర్షన్‌ను   గీతా ఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్‌ విడుదల చేశారు. తొలిరోజే  ఈ చిత్రం రూ.3 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సంస్థ తెలిపింది. ఒక డబ్బింగ్‌  చిత్రానికి ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం రికార్డ్‌ అంటూ నెట్టింట పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. అయితే, రెండో రోజు 'ఛావా' తెలుగు కలెక్షన్స్‌ మరింత పెరిగాయి. రెండు రోజులకు గాను టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 6.81 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. నేడు ఆదివారం కావడంతో సులువుగా రూ. 10 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్‌ ఆయన సతీమణి యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక మందన్న జీవించేశారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రతో అక్షయ్‌ ఖన్నా అదరగొట్టేశారని చెప్పవచ్చు. దీంతో ఛావా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు దాటేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)