Breaking News

రవితేజ నిర్మించిన సినిమాలో హీరోగా చేయడం కలలా ఉంది: కార్తీక్‌ రత్నం

Published on Wed, 09/13/2023 - 00:14

‘కేరాఫ్‌ కంచరపాలెం, నారప్ప’.. ఇలా నటుడిగా ఇప్పటివరకూ చాలా ఇంటెన్స్‌ క్యారెక్టర్స్‌ చేసిన నేను ‘ఛాంగురే బంగారురాజా’లో తొలిసారి ఓ కామెడీ రోల్‌ చేశాను. కామెడీ చేయడం కష్టం అంటుంటారు. కానీ మంచి స్క్రిప్ట్‌ ఉంటే కామెడీ చేయడం సులభమేనని నాకు అనిపించింది’ అన్నారు కార్తీక్‌ రత్నం.

సతీష్‌ వర్మ దర్శకత్వంలో కార్తీక్‌ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా నటించిన చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ పిక్చర్స్‌తో కలిసి హీరో రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తీక్‌ రత్నం మాట్లాడుతూ– ‘‘రంగస్థల నటుడిగా వందకుపైగా నాటకాలను ప్రదర్శించాను. మొదటి నాటకానికే నంది అవార్డు వచ్చింది.

నాలా ఇండస్ట్రీకి వచ్చే కొత్తవారికి రవితేజ, నానీగార్లే స్ఫూర్తి. అలాంటిది రవితేజ నిర్మించిన సినిమాలో  నేను హీరోగా నటించడం కలలా ఉంది.  కొన్ని కొండ ప్రాంంతాల్లో లభించే విలువైన రంగు రాళ్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో మెకానిక్‌ బంగారు రాజా పాత్ర చేశాను.  దర్శకుడు సతీష్‌వర్మగారికి రైటింగే బలం. స్పాట్‌లో ఆయన స్క్రిప్ట్‌ను ఇంప్రూవ్‌ చేస్తుంటారు.

నేను నటించిన ‘శ్రీరంగ నీతులు’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ప్రకాశ్‌రాజ్, దర్శకుడు ఏఎల్‌ విజయ్‌లు కలిసి నిర్మిస్తున్న ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ఒప్పుకున్నాను. మరో ఎగ్జైటింగ్‌ప్రాంజెక్ట్‌ను త్వరలోనే ప్రకటిస్తాను’’ అన్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)