Breaking News

‘చంద్రయాన్’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Published on Fri, 11/13/2026 - 17:17

మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామం నేపథ్యంలో చంద్రుడిపైకి వెళ్లాలనే వినూత్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘చంద్రయాన్’. ‘నీది నాది ఒకే కథ’, ‘విరాటపర్వం’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఊడుగుల ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం ఆసక్తికరం. శివకుమార్ దీకొండ, స్వప్న ప్రియదర్శిని జంటగా నటించగా.. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? చంద్రుడిపైకి వెళ్లాలనే ఈ యువకుల ప్రయాణం ఎలా సాగింది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే?
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామానికి చెందిన నలుగురు యువకులు రవి, శివ, రాజు, చిన్నా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చదువు పెద్దగా అబ్బకపోవడంతో ఊళ్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తుంటారు. వీరిలో ఒకరికి ముహూర్తాలపై నమ్మకం ఉంటే.. మరొకరు గూగుల్‌ను నమ్ముకుని పనులు చేస్తుంటారు. వీరి వ్యవహారశైలితో విసిగిపోయిన గ్రామస్థులు వారికి శని సంఘం అనే పేరు పెడతారు.

ఇలా ఊళ్లో అందరి చేత మాటలు పడే శివ.. బిందు అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమెను ఆకట్టుకునేందుకు ఏదైనా కొత్తగా చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో రాకెట్‌ను తయారు చేసి చంద్రుడిపైకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. మరి ఈ నలుగురి ప్రయోగం ఎలాంటి మలుపులు తిరిగింది? శివ తన ప్రేమను గెలుచుకున్నాడా? కనీసం చదువు కూడా సరిగా రాని ఈ యువకులు చంద్రుడిపైకి వెళ్లాలనే తమ కలను నెరవేర్చుకున్నారా? అనేది తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే?
చంద్రుడిపైకి వెళ్లాలనే గ్రామీణ యువకుల కలను వినోదాత్మకంగా చెప్పాలనే ప్రయత్నం కొత్తగా ఉంది. ముఖ్యంగా మందమర్రి వంటి గ్రామీణ నేపథ్యంలో ఇలాంటి కథను ఎంచుకోవడం ఆసక్తికరం. అయితే ఈ ఆలోచనను ఆసక్తికరమైన కథనంగా మలచడంలో దర్శకుడు పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోయారు.

ఫస్టాఫ్‌లో నలుగురు యువకుల అమాయకత్వం, వారి మధ్య సంభాషణలు, రాకెట్ తయారీ కోసం చేసే ప్రయత్నాలు అక్కడక్కడా నవ్విస్తాయి. ముఖ్యంగా గ్రామీణ వాతావరణం, తెలంగాణ యాసతో కూడిన సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. స్నేహితుల మధ్య ఉండే సరదా సన్నివేశాలు బాగున్నాయి. అయితే కథనం మాత్రం నెమ్మదిగా సాగుతుంది.

సెకండాఫ్‌లో సినిమా మరింత నెమ్మదిస్తుంది. ప్రధాన కథాంశంపై ఆసక్తి పెంచాల్సిన సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. కొన్ని చోట్ల కామెడీ పండినా.. మరికొన్ని సన్నివేశాలు మాత్రం సహనానికి పరీక్ష పెడతాయి. చంద్రుడిపైకి వెళ్లాలనే ప్రధాన అంశాన్ని మరింత ఆసక్తికరంగా చూపించి ఉంటే బాగుండేది. నలుగురు యువకుల స్నేహం, తమ కలను నెరవేర్చుకోవాలనే తపన వంటి అంశాలు కొన్ని చోట్ల ఆకట్టుకుంటాయి. కానీ బలమైన కథనం లేకపోవడంతో సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

ఎవరెలా చేశారంటే?
శివకుమార్ దీకొండ, స్వప్న ప్రియదర్శిని తమ పాత్రలకు న్యాయం చేశారు. రవి శివతేజ, వంశీధర్, లోకేష్ తమ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. నటీనటుల గెటప్స్, తెలంగాణ యాస కథకు తగ్గట్టుగా ఉన్నాయి. హర్ష ప్రవీణ్ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది. శ్రీనివాస బి సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని, మందమర్రి పరిసరాలను సహజంగా తెరపై చూపించారు. పుల్లారావు దాసరి ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే సినిమా నిడివి తగ్గి కొంత ఆసక్తికరంగా ఉండేది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

చివరిగా
చంద్రుడిపైకి వెళ్లాలనే గ్రామీణ యువకుల వినూత్నమైన ఆలోచనతో తెరకెక్కిన సినిమా ‘చంద్రయాన్’. అక్కడక్కడా నవ్వించినా.. ఆసక్తికరమైన కథనం లేకపోవడం, సాగదీసిన సన్నివేశాలు సినిమాకు ప్రతికూలంగా మారాయి.

రేటింగ్‌: 2.5/5

​‍-ప్రశాంత్‌ కందా

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు