Breaking News

రామ్‌చరణ్‌,వెంకటేష్‌ కోసం వారిద్దరూ ఆలోచిస్తే మేము తగ్గాల్సిందే‌: దర్శకుడు

Published on Tue, 10/29/2024 - 13:53

నాగచైతన్య హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియన్‌ సినిమా 'తండేల్‌' కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల గురించి తాజాగా దర్శకుడు చందూ మొండేటి క్లారిటీ ఇచ్చారు.

'తండేల్‌' షూటింగ్‌ గురించి మాట్లాడుతూ దర్శకుడు చందూ  ఇలా చెప్పుకొచ్చారు. 'సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి అయింది. జనవరిలో విడుదల చేసేందుకు మేము రెడీగా ఉన్నాం. ఇంకో పదిరోజులు షూట్‌ చేస్తే సినిమా పూర్తి అవుతుంది. కానీ, చరణ్ గారి సినిమా వస్తుందని అరవింద్ గారు.. వెంకీ మామ సినిమా వస్తుందని చైతూ గారు ఆలోచిస్తే.. మాత్రం సంక్రాంతి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. జనవరి 26న విడుదల చేద్దామనుకుంటే  ఆదివారం కాబట్టి అవకాశం లేదు. సంక్రాంతి కంటే ముందే రిలీజ్‌ చేయాలంటే సినిమా పూర్తి కాదు.' అని  చందూ మొండేటి తెలిపారు.

తండేల్‌ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలోనే విడుదలయ్యే ఛాన్స్‌ ఉంది. 'లవ్‌ స్టోరీ' చిత్రం తర్వాత  నాగచైతన్య,  సాయి పల్లవి కలిసి నటిస్తున్న రెండో చిత్రం. ఈ మూవీలో ఆమె డీగ్లామర్‌ పాత్రలో కనిపించనుంది. అయితే.. చైతూ- చందు మొడేటి కాంబినేషన్‌లో మూడో చిత్రంగా తండేల్‌ రానుంది. వారిద్దరి నుంచి ఇప్పటికే ప్రేమమ్‌, సవ్యసాచి చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)