Breaking News

నిహారికపై చైతన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు!

Published on Tue, 07/11/2023 - 13:15

టాలీవుడ్‌ నటి నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ఇది జరిగి పదిరోజులు దాటినా ఇప్పటికీ పలు యూట్యూబ్‌ ఛానల్స్‌లలో వీరిద్దరి టాపిక్‌ నడుస్తూనే ఉంది. అంతే కాకుండా సోషల్‌మీడియాలో కూడా కామెంట్ల రూపంలో చర్చ జరుగుతూనే ఉంది. వీరిద్దరూ ఎందుకు విడిపోయారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలయదు. వారి కుటుంబ సభ్యలు కూడా బహిరంగంగా ఎక్కడా మాట్లాడనూ లేదు. నిహారికతో పాటు చైతన్యపై కూడా పలువురు నెగటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయంపై చైతన్య తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు తన సన్నిహితుల వద్ద ఇలా చెప్పారని ప్రచారం జరగుతుంది.

(ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్‌..?)

'నేను ఉద్యోగరిత్యా గౌరవమైన హోదాలో ఉన్నాను..  ఇంట్లో పెద్ద వాళ్లతో నిహారిక ఒక్క రోజు కూడా గౌరవంగా మసులుకోలేదు.. అసలు భర్తతో కలిసి జీవించాలనే ఆలోచన తనకు లేదు.. తన భర్త పై ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. ఎప్పుడు చూసిన క్లబ్బులు, పబ్బులు అంటూ తిరగడమే తప్ప కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇప్పుడు మెగా అభిమానులు నా కుమారుడి గురించి చెడుగా ప్రచారం చేయడాన్ని చూసి సహించలేకపోతున్నాను' అని జొన్నలగడ్డ  ప్రభాకర్ రావు చెప్పారట.

(ఇదీ చదవండి: యువతికి కేక్‌ తినిపించిన బాలకృష్ణ.. ఆమె ఎవరంటూ..)

ఈ స్టేట్‌మెంట్‌లోని మాటలు ఆయన అన్నారో లేదో తెలియదు కానీ గత వారం నుంచి వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయని కొందరు నెటిజన్లు తెలుపుతున్నా మరికొందరు మాత్రం ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదనే వారు కూడా ఉన్నారు. ఏదేమైనా వారి వ్యక్తిగత జీవితం గురించి నెగటివ్‌గా మాట్లాడటం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.


 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)