Breaking News

జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు

Published on Wed, 12/11/2024 - 08:04

కుటుంబ వివాదంలో సతమతమవుతున్న నటుడు మోహన్ బాబుకి మరో షాక్ తగిలింది. మోహన్ బాబు ఫ్యామిలీలో అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు మంగళవారం రాత్రి పలువురు జర్నలిస్టులు జల్‪‌పల్లిలోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ప్రశ్న అడిగేందుకు ఓ రిపోర్టర్ ప్రయత్నించగా.. అతడి దగ్గరున్న మైక్ లాక్కొని సదరు జర్నలిస్టుపైనే మోహన్ బాబు దాడి చేశాడు.

(ఇదీ చదవండి: నా గుండెలపై తన్నావ్.. మోహన్ బాబు ఆడియో వైరల్)

ఈ దాడిలో సదరు జర్నలిస్టు తలపై కాస్త గట్టిగానే గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని.. ఇప్పటికే పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ దాడి విషయమై 118 బీఎన్ఎస్ యాక్ట్ కింద.. మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.

118 బీఎన్ఎస్ యాక్ట్ విషయానికొస్తే.. 2023 భారతీయ న్యాయ సంహిత ప్రకారం ప్రమాదకరమైన ఆయుధాలతో దాడి చేస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. దీనికి ప్రతిగా మూడేళ్ల జైలుశిక్ష లేదంటే రూ.20 వేల జరిమానా విధించొచ్చు. కొన్నిసార్లు రెండింటిని కూడా విధించే అవకాశముంది.

మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన గొడవ దృష్ట్యా.. తమ దగ్గరున్న లైసెన్స్ గన్స్ సరెండర్ చేయాలని పోలీసులు.. మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లని ఆదేశించారు. అలానే బుధవారం ఉదయం పదిన్నర గంటలకు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

(ఇదీ చదవండి: మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్.. గేట్లు బద్దలు కొట్టిన మనోజ్!)

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు