Breaking News

తెలుగులో 'కెప్టెన్‌ మిల్లర్‌' వచ్చేస్తున్నాడు.. పండుగరోజు సందడే

Published on Fri, 01/12/2024 - 13:38

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్‌లోకి వచ్చేసింది.  కానీ తెలుగులో విడుదల కాలేదు. దీనికి ప్రధాన కారణం సంక్రాంతికి టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు విడుదల కావడమే అని చెప్పవచ్చు. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయలేదు. తాజాగా కెప్టెన్‌ మిల్లర్‌ తెలుగు రిలీజ్‌ తేదీని మేకర్స్‌ ప్రకటించారు.

కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌, ఏషియన్‌ సినిమాస్‌ వారు విడుదల చేయనున్నారు. ఇదే విషయాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు ప్రకటించారు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్‌ను కూడా వారు విడుదల చేశారు. అదే సమయంలో బాలీవుడ్‌ హీరో హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమా కూడా రాబోతుంది. కానీ తెలుగులో ధునుష్‌కు ఎక్కువగా ఫ్యాన్‌ బేస్‌ ఉంది కాబట్టి కెప్టెన్‌ మిల్లర్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు.

నేడు విడుదల అయిన కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. 1930ల బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ తెరకెక్కింది. సినిమాలో సెట్టింగ్స్‌తో పాటు సినిమాటోగ్రఫీ చాలా బాగుందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఈ చిత్రంలో జివి ప్రకాష్ బిజిఎమ్ మరో లెవెల్ అని విమర్శకులు అంటున్నారు. కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అని, సెకండాఫ్ యాక్షన్ ప్యాక్డ్ ఎఫైర్ అని అంటున్నారు.  అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్‌ నటీనటులు ఇందులో నటించారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)