Breaking News

హర్రర్ థ్రిల్లర్ చిత్రంగా రానున్న 'సి 202' ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

Published on Fri, 01/26/2024 - 20:55

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'సి 202' (C 202) ఫస్ట్ లుక్ విడుదలయింది. ఈ చిత్రాన్ని మైటీ ఒక్ పిక్చర్స్ (Mighty Oak Pictures) పతాకంపై మనోహరి కె ఎ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా గోవా బ్యూటీ  షారోన్ రియా ఫెర్నాండెజ్ నటిస్తుండగా మున్నా కాశి హీరోగా పలకరించనున్నాడు. ఇందులో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను వంటి నటులు కూడా ఉన్నారు.  హర్రర్ థ్రిల్లర్ చిత్రంగా 'సి 202' రానుంది. షూటింగ్ అంత పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది.  ఈ చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది.జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్  పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ.. 'సి 202' (C 202) చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. కథ స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా అద్భుతమైన సస్పెన్స్‌తో తెరకెక్కించాం. హారర్ సన్నివేశాలతో మంచి త్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో సినిమాని చిత్రకరించాము. షూటింగ్ అంతా ఇప్పటికే పూర్తి అయింది. ప్రస్తుతానికి రామానాయుడు స్టూడియోస్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాంకేతికంగా మేము హై-ఎండ్ కెమెరాలతో పాటు మంచి లైటింగ్ పరికరాలను ఉపయోగించాము. మా చిత్రంలో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలు పోషించారు. వీళ్ళు ఎప్పుడు చేయని పాత్రలో నటించి ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తారు.

ఈ చిత్రంలో 21 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌ కూడా ఉంటుంది. నా గత చిత్రం హేజా(Heza)  మంచి పేరు తెచ్చిపెట్టింది. అమెజాన్ ప్రైమ్‌లో ఆ చిత్రాన్ని చూసి నన్ను చాలా మంది పార్ట్‌-2 ఎప్పుడని అడుగుతున్నారు. దానికి సీక్వెల్‌ త్వరలోనే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మంచి హారర్ థ్రిల్లర్ చిత్రం  'సి 202' (C 202)తో  మీ ముందుకు వస్తున్నాం. త్వరలో ట్రైలర్ ను విడుదల చేస్తాం' అని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో మున్నా కానీ హీరోగా నటిస్తూనే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం అందించారు.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)