Breaking News

‘స్పిరిట్’ వెనక్కి.. సందీప్‌కి ట్విస్ట్‌ ఇచ్చిన ప్రభాస్‌!

Published on Wed, 04/30/2025 - 11:28

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కొన్నేళ్లపాటు ఫుల్ బిజీ! ఇప్పటికే ఆయన అరడజను సినిమాల వరకు బాకీ ఉన్నాడు. వాటిల్లో ముందుగా రాబోయేది మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘రాజాసాబ్‌’ సినిమా. పిపుల్స్‌ మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. దీని తర్వాత ప్రభాస్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’(ప్రచారంలో ఉన్న టైటిల్‌) చేయబోతున్నాడు. ఆ తర్వాత యానిమల్‌ ఫేం సందీప్‌ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో ‘స్పిరిట్‌’(Spirit) చేయాల్సింది. ఈ రెండు పూర్తయిన తర్వాత నాగ్‌ అశ్విన్‌, ప్రశాంత్‌ నీల్‌తో పాటు యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో కూడా సినిమా చేయాలి. కానీ ఇప్పుడు ఈ ఆర్డర్‌ మారినట్లు తెలుస్తోంది. ‘స్పిరిట్‌’ని వెనక్కినెట్టి ప్రశాంత్‌ వర్మ సినిమా చేయడానికి ప్రభాస్‌ రెడీ అవుతున్నాడని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘స్పిరిట్’కి బ్రేక్‌కి కారణం ఏంటి?
సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ స్క్రిప్ట్‌ను పూర్తి చేసి, లొకేషన్లు కూడా ఫైనల్ చేస్తున్నాడు. కానీ, ఈ సినిమా కోసం సందీప్ విధించిన కండీషన్లే ప్రభాస్‌ను కాస్త వెనకడుగు వేయించాయని టాక్. 65 రోజుల వరుస కాల్షీట్స్, డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయాలన్న సందీప్ షరతులకు ప్రభాస్ మొదట ఓకే చెప్పినప్పటికీ, ఇప్పుడు మాత్రం ప్రశాంత్ వర్మ సినిమాను ప్రాధాన్యతగా తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ భోర్సే నటించనుందని బజ్.

డబుల్ షూటింగ్‌తో బిజీ! 
‘రాజాసాబ్’ షూటింగ్ పూర్తయిన వెంటనే హను రాఘవపూడి ‘ఫౌజీ’తో పాటు, ప్రశాంత్ వర్మ సినిమా షూటింగ్‌లోనూ ప్రభాస్ పాల్గొననున్నాడట. ప్రస్తుతం ఇటలీ టూర్‌లో ఉన్న ప్రభాస్, తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంపై క్లారిటీ రానుంది. మరి, ఈ షెడ్యూల్ మార్పు వెనుక అసలు కథేంటో తెలియాలంటే, మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)