Breaking News

‘కల్కి​’2 కి బ్రేక్‌.. సాయి పల్లవితో చర్చలు.. నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ ఏంటి?

Published on Sat, 10/04/2025 - 16:26

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌(Nag Ashwin ) తెరకెక్కించిన పాన్‌ ఇండియా మూవీ ‘‍కల్కి’ 2898 ఏడీ’(Kalki 2898 AD) ఇండస్ట్రీని షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో రిలీజైన అయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని రిలీజ్‌ సమయంలోనే ప్రకటించాడు. అంతేకాదు దానికి సంబంధించిన వర్క్‌పైనే నాగ్‌ అశ్విన్‌ ఇన్నాళ్లు దృష్టి పెట్టాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం అవుతుందని భావిస్తున్నవేళ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి నాగ్‌ చిన్నపాటి షాక్‌ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుని కొన్నాళ్ల పాటు పక్కకు పెట్టి.. ఓ లేడి ఓరియెంటెండ్‌ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.

ఆలియా అవుట్‌.. సాయి పల్లవి ఇన్‌?
కల్కి చిత్రానికి కంటే ముందే నాగ్‌ అశ్విన్‌ ఓ లేడీ ఓరియెంటెండ్‌ స్టోరీ రాసుకున్నాడు. ఈ చిత్రాన్ని కూడా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్‌ చేశాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌కి కథ కూడా వినిపించాడట. ఆమె కూడా ఈ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆలియా తప్పుకుందట. డేట్స్‌ కుదరకపోవడంతో నాగ్‌ అశ్విన్‌కి నో చెప్పేసిందట. దీంతో నాగ్‌ అశ్విన్‌ ఇప్పుడు ఈ కథను సాయి పల్లవి(sai Pallavi)తో తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఇప్పటికే సాయి పల్లకి స్టోరీ నెరేట్‌ చేశాడని..ఆమె కూడా ఒప్పుకుందని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.

కల్కి 2  ఎప్పుడు?
వాస్తవానికి నాగ్‌ అశ్విన్‌ ఇప్పుడు కల్కి 2 చిత్రాన్నే తెరకెక్కించాలి. ఈ మేరకు పనులు కూడా ప్రారంభించారు. అయితే ప్రభాస్‌ డేట్స్‌ కుదరడం లేదట.   ప్రస్తుతం ఆయన రాజాసాబ్‌(పాటలు), ఫౌజీ సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే ‘స్పిరిట్‌’ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. మరోవైపు సలార్‌ 2 స్క్రిప్ట్‌ కూడా రెడీగా ఉంది. వీటి తర్వాతే కల్కి 2కి ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చే చాన్స్‌ ఉంది.  

ఈ లెక్కన దాదాపు ఏడాది వరకు ప్రభాస్‌(Prabhas) డేట్స్‌ దొరకడం కష్టమే. మరోవైపు ఈ సినిమా నుంచి దీపికా పదుకొణెను తప్పించారు. ఇప్పుడు కొత్త హీరోయిన్‌ని ఎంపిక చేయాలి. దీనికి కొంత సమయం పడుతుంది.  అందుకే నాగ్‌ అశ్విన్‌ ఈ గ్యాప్‌లో మరో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం సాయి పల్లవి డేట్స్‌ కూడా ఖాలీగానే ఉన్నాయట. ‘రామాయణ్‌’ మినహా ఆమె చేతిలో మరో చిత్రమేది లేదు. నాగీ కూడా వచ్చే రెండు, మూడు నెలల్లోనే ఈ మూవీ షూటింగ్‌ కంప్లీట్‌ చేయాలని చూస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలోనే నాగ్‌ అశ్విన్‌- సాయి పల్లవిల సినిమాను తెరపై చూడొచ్చు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)