Breaking News

రాజకీయాల్లోకి కీర్తి సురేష్‌.. ఆ పార్టీలో చేరనుందా?

Published on Wed, 07/09/2025 - 09:15

సినీ కథానాయికలు ఎప్పుడు ఏ అవతారం ఎత్తుతారో చెప్పడం సాధ్యం కాదు. నటి కీర్తి సురేష్‌ గురించి ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. బాలనటిగా రంగప్రవేశం చేసిన ఈమె ఒక సమయంలో ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని ఆశ పడ్డారట. ఓ భేటీలో తన ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అయితే కథానాయికిగా రంగ ప్రవేశం చేసి పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఇదు ఎన్నమాయం చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్‌ తొలి చిత్రం ఆశించిన విజయాన్ని అందించింది. ఆ తరువాత నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌కు చేరుకున్నారు. అలాగే తెలుగులో మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. 

ఆ తరువాత బాలీవుడ్‌  ప్రేక్షకులను బేబీ జాన్‌ చిత్రంతో పలకరించారు. అలాగే తన 15 ఏళ్ల స్నేహితుడిని గత ఏడాది చివరిలో పెళ్లి చేసుకుని ఇల్లాలుగా మారారు. ఆ కారణం చేతనో, వరుస అపజయాల కారణంగానో కీర్తి సురేష్‌కు అవకాశాలు తగ్గాయి. వివాహానంతరం ఈ బ్యూటీ కొత్త చిత్రం ఏదీ చేయలేదు. అంతకు ముందు నటించిన ఉప్పు కారం అనే చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదల అయ్యింది.

సినిమా అవకాశాలు తగ్గినా కమర్షియల్‌గా నటిస్తూ బిజీగానే ఉన్నారు. కాగా ఇటీవల ఈమె మదురైలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ ఆమెను చూడగానే కొందరు అభిమానులు టీవీకే..టీవీకే అంటూ నటుడు విజయ్‌ పార్టీ పేరు చెబుతూ కేకలు పెట్టారు. అందుకు కారణం లేకపోలేదు. కీర్తిసురేష్‌ నటుడు విజయ్‌కు జంటగా రెండు చిత్రాల్లో నటించారు. దీంతో కీర్తి సురేష్‌ నటుడు విజయ్‌ ప్రారంభించిన టీవీకే  పార్టీలో చేయబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో సమాచారం వైరల్‌ అయ్యింది.  దీనిపై కీర్తి సురేష్‌ స్పందించలేదు. దీంతో ఆమెకు  రాజకీయాలపై ఆసక్తి ఉందని, విజయ్‌ పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం జోరందుకుంది. అందుకే విజయ్‌ అభిమానులు ఆమెను చూడగానే టీవీకే అంటూ కేకలు పెట్టారు. మరి నటి కీర్తి సురేష్‌ నిర్ణయం ఏమిటో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)