Breaking News

బాలయ్య హోస్ట్‌.. చిరంజీవి గెస్ట్‌?

Published on Sat, 08/10/2024 - 16:43

బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ ఎంత పెద్ద సక్సెస్‌ అయిందో తెలిసిందే. ఆహాలో స్ట్రీమింగ్‌ అయిన ఈ షో తొలి రెండు సీజన్లు మంచి విజయం సాధించాయి. లిమిటెడ్‌గా వచ్చిన మూడో సీజన్‌ అంతగా విజయం ఆకట్టుకోలేకపోయింది. దీంతో నాలుగో సీజన్‌ని మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు మేకర్స్‌. త్వరలోనే అన్‌స్టాపబుల్‌ నాలుగో సీజన్‌ ప్రారంభం కాబోతుంది. ఈ కొత్త సీజన్‌లో కొత్త కొత్త సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేశారట మేకర్స్‌.

ఇప్పటికే  ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, పవన్‌ కల్యాణ్‌ లాంటి స్టార్‌ హీరోలంతా ఈ షోలో సందడి చేశారు. ఇక నాలుగో సీజన్‌కి ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి రాబోతున్నట్లు తెలుస్తోంది. అన్‌స్టాపబుల్‌ షో ప్రారంభం నుంచి అభిమానులంతా చిరంజీవి గెస్ట్‌గా రావాలని కోరుకుంటున్నారు. మూడో సీజన్‌లోనే చిరంజీవి వస్తారని పుకార్లు వచ్చాయి. కారణం ఏంటో తెలియదు కానీ చిరు మాత్రం రాలేకపోయాడు. 

అయితే ఈ సారి షో ప్రారంభమే చిరంజీవితో ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి బర్త్‌డే (ఆగస్ట్‌ 22)సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ సీజన్‌లో చిరుతో పాటు నాగార్జున కూడా సందడి చేయబోతున్నారట. అలాగే మరో సీనియర్‌ హీరో వెంకటేశ్‌తో కూడా టీమ్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన నుంచి ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదని సమాచారం.  ఒకవేళ వెంకీమామ కూడా ఓకే అంటే.. టాలీవుడ్‌ దిగ్గజ హీరోలంతా ఈ కొత్త సీజన్‌లో సందడి చేసినట్లే అవుతుంది.  కొత్త సీజన్ ప్రారంభం ఎప్పుడు? గెస్ట్‌లు ఎవరనేది తెలియాలంటే ఆహా నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?