Breaking News

వెండితెరపై సునీత విలియమ్స్‌ బయోపిక్?

Published on Wed, 03/19/2025 - 16:13

సునీతా విలియమ్స్‌ (Sunita Williams).. ఈ పేరు ఇప్పుడు యావత్‌ ప్రపంచం మొత్తం మారోమోగిపోతోంది. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్‌ దాదాపు 9 నెలల పాటు అంతతరిక్షంలోనే గడిపి మంగళవారం(భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 2.41 గంటలకు) స్పేస్‌ ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ వ్యోమనౌకలో భూమి మీదకు వచ్చింది. సునీత క్షేమంగా రావాలంటూ యావత్‌ ప్రపంచం కోరుకుంది. ఆమె క్షేమంగా భూమి మీదకు చేరుకుందనే వార్త తెలియగానే సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. 

(చదవండి: సునీతా విలియమ్స్‌ ఫ్యామిలీ గురించి తెలుసా?)

ఆమె చేసిన సేవలను, సాహసాలను కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సునీతా విలియమ్స్‌ గురించి ఓ ఆసక్తికర న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతుందట. ఆమె చేసిన సాహోసోపేతమైన యాత్రలను వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నయట. ఇప్పటికే బాలీవుడ్‌కి చెందిన పలువురు దర్శక నిర్మాతలు సునీత లైఫ్‌ జర్నీని కథగా మలిచే పనిలో పడ్డారట. 

బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ సునీతా విలియమ్స్‌ బయోపిక్‌ గురించి చర్చలు జరుగుతున్నాయట. సునీత విలియమ్స్ జీవితంలోని స్ఫూర్తిదాయక అంశాలు, ఆమె శిక్షణ, నాసాలో చేరడం, అంతరిక్షంలో 322 రోజులు గడపడం, మరియు భూమికి సురక్షితంగా తిరిగి రావడం.. ఈ అంశాలతో భారీ బడ్జెట్‌లో ఓ సినిమా చేసేందుకు బాలీవుడ్‌కి చెందిన బడా డెరెక్టర్‌ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్‌తో సునీతకు సంబంధం ఉండడంతో ఆమె బయోపిక్‌ని ఇక్కడ కచ్చితంగా  ఆదరిస్తారని సదరు దర్శకుడు బలంగా నమ్ముతున్నాడట. మరి సునీతా బయోపిక్‌  వచ్చేది హాలీవుడ్‌ లోనా? లేదా బాలీవుడ్‌లోనా? చూడాలి.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)