Breaking News

వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తీశా : బన్ని వాసు

Published on Wed, 02/22/2023 - 12:06

‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా కథను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తీర్చిదిద్దిన విధానం చూసి ముచ్చటేసింది. నేను ఎప్పటి నుంచో అనుకున్న సీన్లను అద్భుతంగా తీశారు. ఆర్ఆర్‌లో విష్ణుతత్త్వాన్ని చెబుతూ వచ్చారు. ఈ సినిమాలోని ట్విస్టులు, కథ, నిడివి విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ నేను మాత్రం సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను.ఇప్పుడే అదే కరెక్ట్‌ అయింది. కొత్తగా డైరెక్షన్ చేయాలని వచ్చే వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఈ సినిమాను తీశాను’అని నిర్మాత బన్ని వాసు అన్నారు.

మురళి కిషోర్‌ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్‌ అబ్బవరం, కాశ్మీర  జంటగా తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.  బన్నీ వాసు మాట్లాడుతూ.. నిర్మాతగా నేను ఈ సినిమా పట్ల హ్యాపీగా ఉంది. నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయింది. కిరణ్ అబ్బవరం మాకు ఎంతో సహకరించారు. కశ్మీర చాలా బిజీగా ఉన్నా కూడా మాకు ఎంతో టైం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు’ అన్నారు. 

‘ప్రతీ అరగంటకు జానర్ మార్చుకుంటూ సినిమా తీయడం మామూలు విషయం కాదు. మా డైరెక్టర్‌ ఈ సినిమాను అద్భుతంగా తీశారు. మా హీరోయిన్‌ కశ్మీర మున్ముందు మంచి విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. కిరణ్ అబ్బవరం వల్లే ఈ సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది’అని నిర్మాత ఎస్.కె.ఎన్‌ అన్నారు. 

‘ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు నందు అన్న, నిర్మాత వాసు అన్నకు థాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’అని కిరణ్‌ అబ్బవరం అన్నారు. ఇంత మంచి చిత్రంలో భాగం అయినందుకు ఆనందంగా ఉందని హీరోయిన్‌ కశ్మీర పరదేశీ అన్నారు.   'ఇది కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. ఆడపిల్ల కంట్లో నీళ్లు వస్తే విష్ణు ఏం చేస్తారో చెప్పే కథ ఇది’ అని దర్శకుడు మురళీ కిషోర్‌ అన్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)