Breaking News

‘ఛావా’ క్లైమాక్స్‌లో కన్నీళ్లు వచ్చాయి: బన్నీ వాసు

Published on Sun, 03/09/2025 - 12:43

‘‘ఒక చరిత్రని సినిమాగా తీయడం అంత సులభం కాదు. అలాంటి ఒక కొత్త చరిత్రని ‘ఛావా’ వంటి గొప్ప సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్‌ లక్ష్మణ్‌గారికి ధన్యవాదాలు. ఈ రోజు మనం స్వేచ్ఛ,  స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నామంటే కారణం శంభాజీ మహారాజ్‌లాంటి మహావీరుల త్యాగ ఫలితమే. ‘ఛావా’(Chhaava Movie) మూవీ క్లైమాక్స్‌లో భావోద్వేగ సన్నివేశాలు చూసి కన్నీళ్లు వచ్చాయి’’ అని నిర్మాత బన్నీ వాసు (bunny vasu)తెలిపారు. 

విక్కీ కౌశల్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్‌ ఉటేకర్‌(Laxman Utekar) దర్శకత్వం వహించారు. దినేష్‌ విజన్‌ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూషన్స్‌ సంస్థ తెలుగులో శుక్రవారం విడుదల చేసింది. 

ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన థాంక్స్‌ మీట్‌లో బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘ఛావా’ కేవలం సినిమా మాత్రమే కాదు... గ్రేట్‌ ఎమోషన్‌. నాలుగు రోజుల్లోనే పాటలని పూర్తి చేసిన ఏఆర్‌ రెహమాన్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్ని ఇస్తోంది. తెలుగులో నాకు వాయిస్‌ ఇచ్చిన ఫణి వంశీగారికి థ్యాంక్స్‌’’ అని నటుడు వినీత్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. 

‘‘మా సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని మాడ్డాక్‌ సీఎఫ్‌ఓ దివ్యాంశ్‌ గోయల్‌ అన్నారు. ఈ థ్యాంక్స్‌ మీట్‌లో తెలుగు డైలాగ్‌ రైటర్‌ సామ్రాట్, తెలుగు డబ్బింగ్‌ డైరెక్టర్‌ రాఘవ, లిరిక్‌ రైటర్‌ శ్రీమణి మాట్లాడారు.  

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు