Breaking News

నెల రోజుల్లో పని పూర్తి చేసిన మెగాస్టార్‌

Published on Mon, 09/18/2023 - 10:38

మలయాళ మెగా స్టార్‌ మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం భ్రమయుగం. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌, వైనాట్‌ స్టూడియోస్‌ సంస్థల అధినేతలు చక్రవర్తి రామచంద్ర, ఎస్‌.శశికాంత్‌ కలిసి నిర్మిస్తున్నారు. మమ్ముట్టి చిత్రం అనగానే కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని ప్రేక్షకులు భావిస్తుంటారు.

అలాంటి కథాంశంతోనే రాహుల్‌ సదాశివన్‌ ఈ మూవీని డైరెక్ట్‌ చేస్తున్నారు. అర్జున్‌ అశోకన్‌, సిద్ధార్థ్‌ భరతన్‌, అమల్డా రైజ్‌ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ గత ఆగస్టు 17వ తేదీన కేరళ సమీపంలోని ఒట్టపాలెం ప్రాంతంలో ప్రారంభమైంది. ఈ నెల 17వ తేదీన మమ్ముట్టి పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయినట్లు నిర్మాతలు తెలిపారు.

అంటే సరిగ్గా నెల రోజుల్లో మమ్ముట్టి భ్రమయుగం చిత్ర షూటింగ్‌ పూర్తి చేశారన్నమాట. అదేవిధంగా ఇతర నటీనటులకు సంబంధించిన సన్నివేశాలను త్వరలో పూర్తి చేసి 2024 ప్రథమార్థంలో భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు.

చదవండి: సూర్య బాలీవుడ్ ఎంట్రీ.. ఆ పాత్రకు సెట్టయ్యేనా?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)