Breaking News

దర్శకుడు రాంబాబు హఠాన్మరణం 

Published on Thu, 07/10/2025 - 04:52

దర్శకుడు కావాలనే కలతో చిత్రపరిశ్రమకి వచ్చి, ఆ అవకాశం అందుకుని ఓ సినిమా తెరకెక్కించి, ఇక ప్రేక్షకుల ముందుకు రావడమే తరువాయి అని సంతోషించేలోపే విషాదం నెలకొంది. తాను ఎంతో కష్టపడి తెరకెక్కించిన ‘బ్రహ్మాండ’ సినిమా ప్రివ్యూ చూస్తూ దర్శకుడు రాంబాబు హఠాన్మరణం చెందారు. ఆమని, బన్నీ రాజు, జయరామ్, కనికా వాద్య, జోగిని శ్యామల, విజయ రంగరాజు కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘బ్రహ్మాండ’. 

ఈ సినిమా ద్వారా రాంబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తెలంగాణ ఒగ్గు కళాకారుల నేపథ్యంలో దాసరి సురేష్, దాసరి మమత నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రివ్యూని హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మంగళవారం రాత్రి యూనిట్‌ చూస్తుండగా హఠాత్తుగా పడిపోయారట రాంబాబు. ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా బ్రెయిన్‌ స్ట్రోక్‌తో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల చిత్ర యూనిట్‌తో పాటు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం రాంబాబు అంత్యక్రియలు జరిగాయి.   
 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)